jordanian parliamentarian says his son join isis and carried out suicide attack

Jordanian mp says son joined is carried out suicide attack

mp son joins isis, mp son carried suicide attack, Jordanian, parliament , Islamic State, son suicide attack, Iraq, medical school , extremist , ISIS ,Western Jordan, US, military , Syria , Iraq, Jordan, medicine, Mazen Dalaeen , ISIS , Ai, Iraq, Anbar , Dabiq, suicide attackers , car bombs , Ramadi, Ukraine , Ukrainian , Islam, Turkey, Syria

A Jordanian parliament member said he learned from Islamic State-linked media that his son carried out a suicide attack in Iraq, three months after dropping out of medical school and joining the extremist group.

ఆ ఎంపీ కొడుకు.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదంలో చేరాడు..

Posted: 10/04/2015 01:54 PM IST
Jordanian mp says son joined is carried out suicide attack

తన కుమారుడు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరాడని జోర్డాన్ పార్లమెంట్ సభ్యుడొకరు తీవ్ర మనోవేదనతో చెప్పాడు. తనకు అందిన సమాచారం బట్టి తన తనయుడు ఇరాక్ లో ఆత్మాహుతి దాడికి కూడా పాల్పడ్డాడని వెల్లడించారు. 23 ఏళ్ల తన కుమారుడు మహ్మద్.. ఐఎస్ లో చేరాడని జోర్డాన్ ఎంపీ మాజెన్ దలాయిన్ తెలిపారు. ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతున్న అతడిని జూన్ నెలలో చివరిసారిగా చూశామని అసోసియేటెడ్ ప్రెస్ తో తన భాధను వెలిబుచ్చాడు. టర్కీ, సిరియా మీదుగా అతడు ఇరాక్ వెళ్లాడని వెల్లడించారు.

తన తనయుడిని నిలువరించేందుకు తాము చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదని ఆయన వాపోయారు. తమ కుమారుడు మృతి చెందినట్టు శనివారం గుర్తించామని చెప్పారు. ఇరాకీ ఆర్మీ పోస్టుపై జరిగిన ఆత్మహుతి దాడిలో చనిపోయిన ముగ్గురు ఫొటోలను ఐఎస్ వెబ్ సైట్ లో పెట్టిందని, అందులో తమ కుమారుడు ఉన్నాడని మాజెన్ దలాయిన్ వివరించారు. తాము తమ కుమారుడికి అన్ని ఇచ్చామన్నారు. తన కుమారుడి అన్ని వున్నా ఐఎస్ పట్ల ప్రభావితుడయ్యాని భాధను వ్యక్తం చేశారు.

తన తనయుడికి కుటుంబం వుంది, డబ్బు వుంది, అదీ కాక మంచి చదువు కూడా వుందని, ప్రస్తుత మెడిసిన్ స్కూల్ లో వైద్యవిద్యను కూడా చదవుతున్నాడని చెప్పుకోచ్చాడు. ఐఎస్ఐఎస్ యువతను వారి ప్రకటనలతో ప్రభావితం చేస్తుందని మాజెన్ దలాయిన్ తెలిపారు. రెచ్చగొట్టే ప్రసంగాలు, వీడియోలతో ఐఎస్ యువతను ఆకర్షిస్తుందన్నారు. జోర్ధన్ సహా పలు దేశాలలో ఐఎస్ ప్రతి ఇంట్లోనూ వుందని ఆయన అవేదన వ్యక్తం చేశారు. టీవీలు, ఇంటర్ నెట్ సహకారంతో ఐఎస్ ఉగ్రవాదులు యువతను తమ ఉగ్రవాదంలోకి లాక్కుంటున్నారని అవేదన వ్యక్తం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jordanian  parliament member  Mazen Dalaeen  

Other Articles