another mp woman puts her foot down on toilet facility in home

Another madhya pradesh woman puts her foot down on toilet facility in home

mp women seema patel, mp husband mohan patel, toilet at in-law's house, betul toilet incident, betul wife left her husband, toilet facility in home, MP woman, Seema Patel, family councelling center

A 20-year-old woman, who left her husband about a year-and-half ago, has refused to return till a toilet is constructed at her in-laws place.

ఆత్మాభిమానంతో.. స్వచ్చ్ భారత్ వైపు అగుడు వేసింది..!

Posted: 10/04/2015 01:13 PM IST
Another madhya pradesh woman puts her foot down on toilet facility in home

తన కాపురం కంటే.. ఆత్మాభిమానమే మిన్నంటూ పుట్టింటికి అలిగిపోయిన భార్యను అమె కోరిక నేరవేర్చి.. తన ఇంటికి సగర్వంగా తీసుకోచ్చాడు భర్త. ఇంతకీ విషయం ఏమిటంటే... తన భర్త ఇంట్లో టాయ్లెట్ లేకపోవడం.. దీంతో ఆరుబయటకు వెళ్లి బహిర్భూమికి వెళ్లడం ఇష్టంలేని భార్య..తన భర్త నిర్మించేదాకా.. కాపురానికి వచ్చేదిలేదని భీష్మించింది. ఇలా ఆ ఇల్లాలు 19 నెలలుగా భర్తకు దూరంగా ఉంటోంది. చివరకు భర్త ఆమె డిమాండ్ నెరవేర్చేందుకు అంగీకరించాడు. మధ్యప్రదేశ్ లోని బెతుల్ జిల్లాలోని షాపూర్లో ఈ సంఘటన జరిగింది.

రెండేళ్ల క్రితం మోహన్ పటేల్ (23)తో సీమా పటేల్(20)కు వివాహమైంది. ఇంట్లో టాయ్లెట్ నిర్మించాల్సిందిగా తన భర్తను పలుమార్లు కోరింది. అయితే మోహన్ నిర్లక్ష్యం చేశాడు. ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోవడంతో సీమా అలిగి తన పుట్టింటికి వెళ్లిపోయింది. మోహన్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా టాయ్లెట్ నిర్మించేవరకు కాపురానికి రానని సీమా పంతం పట్టింది. సమస్య పరిష్కారం కోసం భర్త ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ఆశ్రయించాడు. ఇటీవల ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ నిర్వాహకులు ఇరు కుటుంబాలను పిలిచి నచ్చజెప్పారు.  సీమా కోరిక న్యాయమైందని, నెల లోపు టాయ్లెట్ నిర్మించాలని మోహన్కు సూచించడంతో అంగీకరించాడు.

బెతుల్ ఎస్పీ రాకేష్ కుమార్ మాట్లాడుతూ.. స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమంలో పోలీసులు కూడా పాల్గొంటున్నారని, ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వాహకుల సూచనను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఇదే జిల్లాలో 2011లో అనితా నారే అనే గిరిజిన మహిళ టాయ్లెట్ డిమాండ్తో భర్తను వీడి పుట్టింటికి వెళ్లిపోయింది. ఎన్జీవో సులభ్ ఇంటర్నేషనల్ స్పందించి ఆమెకు 5 లక్షల రూపాయలను బహుమతిగా అందించింది. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన అనితకు రాష్ట్రపతి అవార్డు దక్కింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : toilet facility in home  MP woman  Seema Patel  

Other Articles