Pradesh Cong president Raghuveera Reddy criticized for animal cruelty

Raghuveera reddy supporters welcome him by firing pigeon rockets

Raghuveera supporters welcome him by firing 'pigeon rockets, Raghuveera Reddy criticized for animal cruelty, Raghuveera Reddy, Pigeon Rockets, APPCC Chief, Congress, kovvur, animal, cruelty, fire works

Pradesh Congress President Raghuveera Reddy is facing criticism for cruelty that was shown towards animals in his presence at West Godavari Dist.

ITEMVIDEOS: పావురాయిలను రాకెట్లకు కట్టి.. ప్రాణాలు తీశారు..

Posted: 10/03/2015 09:49 PM IST
Raghuveera reddy supporters welcome him by firing pigeon rockets

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో కాంగ్రెస్‌ కార్యకర్తల అత్యుత్సాహం రెండు మూగ జీవాలను బలి తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ కార్యకర్తులు అతి ప్రదర్శించారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో రఘువీరా పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వినూత్నంగా ఏర్పాట్లు చేసి విమర్శల పాలయ్యారు. అంతేకాదు విమర్శలు కార్యకర్తలకు కాకుండా స్వయంగా రఘువీరారెడ్డిని కూడా ముంచెత్తాయి. స్వయంగా ఆయన సమక్షంలోనే ఈ రెండు హత్యలు జరగడం కలకలం రేపుతోంది.

ఇంతకీ ఏం చేశారంటున్నారా..? రఘువీరారెడ్డికి స్వాగతం పలికేందుకు ఏర్పాటు బాణాసంచా పేల్చారు. అయితే అందులోని రెండు తారాజువ్వలకు రెండు పావురాలను కట్టారు. ఇంకేముంది వాటికి కూడా నిప్పుపెట్టి పెకి ఎగురవేశారు. తారాజువ్వల ధాటికి ఆ రెండు పావురాలు కాసేపట్లోనే నేలకొరిగాయి.  అయితే ఈ సమయంలో రఘువీరారెడ్డి కూడా అక్కడే ఉన్నారు. అయితే ఈ ఘటనపై ఆయన ఏమీ మాట్లాడకపోవటంతో ....ఆర్భాటం కోసం పక్షుల ప్రాణాలు తీస్తారా అంటూ వన్యప్రాణి సంరక్షణ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు స్థానికుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghuveera reddy  kovvur  animal  cruelty  fire works  

Other Articles