Scott Eastwood and model Charlotte McKinney are seen together for first time since rumours started swirling they're an item

Eastwood and model charlotte are dating

Hollywood actor Scott Eastwood, model Charlotte McKinney, Scott Eastwood and model Charlotte dating, two stars walking side by side in Malibu.

Scott Eastwood and Charlotte McKinney have started dating. The next day photos emerged of the two stars walking side by side in Malibu.

ఔను వాళిద్దరూ డేటింగ్ చేస్తున్నారు.. పుకార్లను నిజం చేస్తున్న ఫోటోలు

Posted: 10/03/2015 07:02 PM IST
Eastwood and model charlotte are dating

ఔను వాళిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. నిజమేనండీ.. వాళ్లిద్దరి మధ్య అన్యోన్యత పెరగడంతో ఈ మేరకు కొన్నాళ్లుగా పుకార్లు వస్తున్నాయి కానీ, ఈ మధ్య ఇది నిజమంటూ సాక్ష్యాలు, ఆధారాలు కూడా బయటపడ్డాయి. వాళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ ఓ బ్రీటీష్ మీడియా కథనాన్ని ప్రచురించిన మరుసటి రోజునే వారిద్దరూ కలసి మలిబు బీచ్ వద్ద పాదరక్షలు లేకుండా కాలినడకన కారులో ఎక్కేప్పుడు తీసీన ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య గత కొన్నాళ్లుగా వస్తున్న పుకార్లు నిజమేనని అభిమానులు బావిస్తున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరూ..? ఏమా కథ అంటారా..?

ప్రముఖ హాలీవుడ్ నటుడు స్కాట్ ఈస్ట్ వుడ్, ప్రముఖ మోడల్ చార్లోటీ మెక్ కిన్నీలు ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయి డేటింగ్ కూడా చేసేస్తున్నారు. 29 ఏళ్ల అందగాడితో 22 అపరంజి బొమ్మ కలసి మలిబు బీచ్ వద్ద స్నానాలు చేసి వస్తూ ఇలా ఫోటోగ్రాఫర్ కి చిక్కారు. చోక్క లేకుండా ఒక చేతిలో టవల్ మరో చేతిలో చెప్పులు పట్టుకుని.. చలువ కళ్లజోడు పెట్టుకుని ఫోన్ లో మాట్లాడుతూ నటుడు ఈస్ట్ వుడ్ వస్తుండగా, అయనకు కొంచెం దూరాన్ని మెయిన్ టెయిన్ చేస్తూ..ఒ చేతిలో పర్సు, మరో చేతిలో పాదరక్షలు పట్టుకుని వస్తుంది మోడల్. ఇప్పుడైనా వీరి మధ్య జరుగుతున్నదేంటో చెబుతారా..? లేక దాటవేత దోరణినే అవలంభిస్తారా..? అన్నది వేచి చూడాల్సిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Hollywood actor  Scott Eastwood  model  Charlotte McKinney  Dating  

Other Articles