Ramdev eyes noodles

Ramdev eyes maggis space with cheaper atta noodles

baba, Ramdev, Noodles, Maggi, Maggi ban, India, Nestle

Ramdev eyes Maggis space with cheaper atta noodles. In a couple of months when Nestle re-launches its Maggi noodles, it will have to fight on two fronts. On the one hand, it faces an uphill task over its noodles' negative brand perception due to the controversy earlier this year. On the other, Nestle will have an equally major challenge from Baba Ramdev's Patanjali Ayurved, which is readying to roll out its own brand of veg atta noodles at a huge discount to Maggi's product.

బాబాజీకా నూడిల్స్

Posted: 10/03/2015 01:11 PM IST
Ramdev eyes maggis space with cheaper atta noodles

అవును.. నూడుల్స్ అంటేనే హడలిపోయే వారికి కాస్త కొత్తగా అనిపించే వార్త. నిన్నటి దాకా రకరకరాల రసాయనాల వల్ల పిల్లల పెద్దల ఆరోగ్యాలు ఆవిరవుతున్నాయని తెగ బాధపడిపోయి వేల కోట్ల రూపాయల విలువైన నూడిల్స్ ను ప్రభుత్వం బంద్ చేసింది. నెస్లీ కంపెనీ వాళ్లయితే మా ప్రోడక్ట్ లో ఎలాంటి తప్పులేదు బాబోయ్ అని ఎంత మొత్తుకున్నా స్టాండర్ట్స్ పకంగా పర్ ఫెక్ట్ గా లేవని అన్నింటిని బ్యాన్ చేశారు. అయితే అంతా అయిపోయిన సంతకు కొత్తావతారంలో వస్తున్నారొ బాబాజీ. ఇంతకీ ఏంటీ బాబాగారి స్పెషల్ అనుకుంటున్నారా..? మా నూడుల్స్ వాడండి.. కెమికల్ ఫ్రీ... అంటూ మార్కెట్లోకి కొత్త ప్రోడక్ట్ తో వస్తున్నారు.

కొత్త సీసాలో పాత మందు అన్న చందాన పాత పేరుతో కొత్త రకరకాల నూడిల్స్ ను తీసుకువస్తున్నారు బాబాజీ. యోగాతో దేశవ్యాప్తంగా ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించి.. పతంజలి సేవా ట్రస్టు ద్వారా రకరకాల ఉత్పత్తులను ఆయుర్వేద పద్దతుల్లో చేశామంటూ మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. అయితే తాజాగా మ్యాగీ నూడిల్స్ బ్యాన్ తర్వాత చాలా మంది వాటికి అలవాటు పడిపోయి.. నూడుల్స్ ను మరిచిపోలేకపోతున్నారు. అయితే తాజాగా బాబా రాందేవ్ పతంజలి బ్రాండ్ ద్వారా నూడుల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. 70 గ్రామలు నూడిల్స్ కేవలం 15 రూపాయలకే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పతంజలి ట్రస్టు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మొత్తానికి ఎంతో కాలంగా దూరమైంది అనుకుంటున్న నూడుల్స్ మళ్లీ మార్కెట్ లో కళకళలాడనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baba  Ramdev  Noodles  Maggi  Maggi ban  India  Nestle  

Other Articles