Revanth Reddy | High court | Cash for vote case

Revanth reddy can travel any where in india

High court, Revanth reddy, Cash for Vote, Tapping, Telangana, ACB, Stephenson

Revanth reddy can travel any where in India. High court orders to give chance to travel any where in inda to Revanth Reddy.

రేవంత్ రెడ్డికి హైకోర్ట్ లో ఊరట.. దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు

Posted: 09/08/2015 11:44 AM IST
Revanth reddy can travel any where in india

ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ పైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి హైకోర్ట్ లో ఊరట లబించింది. ఓటుకు నోటు కేసులో ప్రస్తుతం బెయిల్ మీద విడుదలై తన సొంత నియోజక వర్గానికి పరిమితమైన రేవంత్ రెడ్డికి హైకోర్ట్ ఊరటనిచ్చింది. కేవలం తన సొంత నియోజక వర్గానికి మాత్రమే పరిమితమై ఉండాలని గతంలో బెయిల్ ఇచ్చే సమయంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి సొంత నియోజక వర్గాన్ని వదిలి బయటకు వెళ్లలేదు. అయితే తాజాగా రేవంత్ రెడ్డికి ఊరట నిస్తూ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా దేశంలో ఎక్కడికైనా వెళ్లేందుకు రేవంత్ రెడ్డికి వీలుకకల్పించింది కోర్ట్. అయితే ఇందులో ఓ చిన్న కండీషన్ పెట్టింది.

ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న రేవంత్ రెడ్డి జైలు జీవితం తర్వాత బెయిల్ మీద బయటకు విడుదలయ్యారు. అయితే బెయిల్ కూడా కొన్ని కండీషన్స్ కు లోబడి మంజూరు చేసింది హైకోర్ట్. తాజాగా వాటిని సడలిస్తే దేశంలో ఎక్కడికైనా వెళ్లేందుకు హైకోర్ట్ వీలుకల్పిస్తోంది. అయితే ప్రతి సోమవారం మాత్రం ఖచ్చతంగా ఏసీబీ కార్యాలయంలో హాజరు కావాలని షరతు విధించింది. దాంతో రేవంత్ రెడ్డి అభిమానుల్లో సందడి మొదలైంది. కోర్టు ఉత్తర్వులకు లోబడి గత కొంత కాలంగా కొడంగల్ నియోజక వర్గానికే పరిమితమైన రేవంత్ రెడ్డి ఇక మీదట బయటకు స్వేచ్ఛగా రాగలుగుతారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలా కాంగా హైదరాబాద్ కు రాని రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు వస్తారని, త్వరలో జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరవుతారని అందరూ బావిస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High court  Revanth reddy  Cash for Vote  Tapping  Telangana  ACB  Stephenson  

Other Articles