trs mla slaps congress mla in mahabubnagar zp meeting

Assult to congress mla in mahaboobnagar zp meeting

assult to congress mla rammohan reddy, TRS mla balaraju slaps mla rammohanreddy, mahabubnagar zp meeting, congress mla rammohan reddy, mahaboobnagar zp meeting, mla balaraju, mla's fighting in zp meeting, mla slaps another congress mla, V. Hanumantha Rao, DK Aruna, TRS mla even hits public in meeting,

The Mahabubnagar Zilla Parishad meeting witnessed unprecedented scenes when ruling Telangana Rashtra Samiti Achampet MLA Guvvala Balaraju slapped Makthal Congress MLA P. Rammohan Reddy after a heated argument on Friday

ITEMVIDEOS: కాంగ్రెస్ ఎమ్మెల్యేను చెంపదెబ్బ కోట్టిన అధికార పార్టీ ఎమ్మెల్యే

Posted: 09/04/2015 04:03 PM IST
Assult to congress mla in mahaboobnagar zp meeting

మహబూబ్‌నగర్ జిల్లా సర్వసభ్య సమావేశం రణరంగంగా మారింది. అధికార, ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగడంతో అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితి, గంధరగోళం చోటుచేసుకున్నాయి. పాలమూరు ఎత్తిపోతల పథకంపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదంటూ టీఆర్ఎస్ నేతలు మండిపడటంతో వివాదం మొదలైంది. ఒకానోక దశలో అది కాస్తా.. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య తీవ్రవాగ్వాదానికి దారి తీసింది. ఈ క్రమంలో .అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని చెంపదెబ్బ కొట్టడంతో సమావేశం రసాబాసగా మారింది.



శుక్రవారం పాలమూరు జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం మహబూబ్‌నగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించకపోవడంపై కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు చేతపట్టి నిరసన చేపట్టారు. కేవలం టీఆర్ఎస్ సభ్యులకు మాత్రమే నిధులు మంజూరు చేస్తున్నారంటూ కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్రవాగ్వాదం, తోపులాట జరిగింది. మాట్లాడేందుకు మైక్ ఇవ్వటం లేదని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వాదనకు దిగారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య మాటా మాటా పెరగడంతో రామ్మోహన్ రెడ్డిపై గువ్వల బాలరాజు చెయ్యి చేసుకున్నారు.

దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వెంటనే కల్పించుకున్న పోలీసులు ఇరు వర్గాలను జెడ్పీ భవన్‌ నుంచి బయటకి పంపించారు. కాగా, దాడిని నిరసిస్తూ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, సంపత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సభ్యులు జెడ్పీ భవన్ ఎదుట ఆందోళనలకు దిగారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరువు జిల్లాగా ప్రకటించాలని కోరినందుకు తమపై చెయ్యి చేసుకుంటారా అని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికొదిలేసి రౌడీయిజాన్ని ప్రదర్శిస్తోందని నిప్పులు చెరిగారు. ఆటు అధికార పార్టీ ఎమ్మెల్యే బాలరాజుకు కూడా తోపులాటలో గాయాలయ్యాయి. దీంతో ఆయన తన వర్గంతో కలిసి జడ్పీ ఛైర్మన్ పోడియం వద్ద బైఠాయించారు. తనను కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా దూషించారని, ఆయనపై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress  TRS  mla rammohan reddy  mahaboobnagar zp meeting  mla balaraju  

Other Articles