‘Pay Me for My Sugarcane Or I’ll Kill Myself’: Farmer to Devendra Fadnavis

Farmer commits suicide 8 hours after cm visit

Farmer commits suicide 8 hours after CM visit, Marathwada, Maharashtra, Farmer’s suicide, Devendra Fadnavis, Maharashtra Chief Minister Devendra Fadnavis, fadnavis visit drought hit farmers, fadnavis understand farmers grievances, fadnavis express solidarity with the farmers, fadnavis curbing farmer's suicides, not helped in curbing farmer’s suicides. Osmanabad, manish patil, Patsangavi village in Osmanabad, Parbhani district, Madhav Bhalerao, Pankaja Munde, a prominent minister in Mr Fadnavis

Manish Patil the farmer committed suicide barely 8 hours after CM had visited Osmanabad shows devendra fadnavis tour has not helped in curbing farmer's suicides

విస్తుపోయిన దేవేంద్రుడు.. గళమెత్తిన మాధవుడు

Posted: 09/04/2015 03:40 PM IST
Farmer commits suicide 8 hours after cm visit

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఒక్కసారిగా విస్తుపోయారు. కరువు కోరల్లో చిక్కకున్న మరట్వాడ ప్రాంతంలో గత మూడు రోజులుగా పర్యటించిన ఆయన.. సుమారుగా 31 గ్రామాలలో 30 వేల పైచిలుకు మంది రైతులను కలసుకుని మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఆర్జీలను స్వీకరించి.. ప్రభుత్వం మీకు అండగా వుంటుందని భరోసా కల్పించారు. అయితే ఆయన భరోసా యాత్ర మాత్రం రైతులలో ధైర్యాన్ని నింపడం లేదు. ఆయన పర్యటించిన వెళ్లిన 8 గంటల వ్యవధిలోనే ఉస్మానాబాద్ జిల్లాలో రైతు ఆత్మహత్యకు పాల్పడటమే ఇందుకు తార్కణంగా నిలుస్తుంది.

బుధవారం సాయంత్రం దేవేంద్ర ఫెడ్నావిస్ ఉస్మానాబాద్ లో పర్యటించారు. ఆయన పర్యటించిన 8 గంటల అనంతరం పట్సాన్గవి గ్రామానికి చెందిన మనీష్ పటిల్ అనే రైతు ముఖ్యమంత్రి హామీలలో కొత్తధనం ఏమీ లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదిలావుండగా, పర్బానీ జిల్లాలో దేవేంద్ర ఫడ్నావిస్ కు రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రైతులు సభలో రభస చేశారు. కరువు ప్రాంతాల రైతులకు సంభంధిచిన రుణాలను ప్రభుత్వం ఎందుకు మాఫీ చేయలేకపోతోందని రైతులు నినదించారు.

ఇక పర్బానీ జిల్లాలో మరోచోట ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నావిస్ కు అనూహ్య పరిణామం ఎదురైంది. ఓ గ్రామంలో సభ నిర్వహిస్తుండగా మాధవ్ భాలేరావ్ అనే రైతు నుంచి విస్తుపోయే ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఫడ్నవీస్ ఓ క్షణంపాటు తన ప్రసంగాన్ని ఆపేయాల్సి వచ్చింది. తమకు చెరుకు పంట సొమ్ము చెల్లించాలని. లేదా తాను ఆత్మహత్య చేసుకుంటానని ఏకంగా ముఖ్యమంత్రికే తేల్చిచెప్పారు రైతు. ఫ్యాక్టరీకి పంట మొత్తాన్ని తరలించి ఆరు నెలలైందని.. ఆ ప్యాక్టరీ కూడా మీ ప్రభుత్వంలోని కీలక మంత్రి పంకజ్ ముండేదని సభికులు సాక్షిగా చెప్పాడు.

అయితే ఆరుమాసాలు కావస్తున్నా... ఇప్పటి వరకు తనకు రూపాయి కూడా యాజమాన్యం చెల్లించడం లేదని చెప్పాడు.. ఎంత అడిగినా పట్టించుకోవడం లేదన్నారు. . మీరు వాటిని చెల్లించేలా చర్యలు తీసుకోండి లేదా ఆత్మహత్య చేసుకుంటాననని రైతు మాదవుడు అభ్యర్థించాడు. ఇది తన ఒక్కడి సమస్య కాదని ఇక్కడ ఉన్నవారందరీ సమస్య' అని ఫడ్నవీస్ను ప్రశ్నించారు. దీంతో ఒక్క క్షణంపాటు ఆగి త్వరలోనే మీకు ఆ మొత్తం అందుతుందని స్వయంగా ముఖ్యమంత్రి రైతు మాధవ్ భాలేరావ్ తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharashtra  Farmer’s suicide  Devendra Fadnavis  

Other Articles