Jat leaders in UP village deny ordering rape of Dalit sisters

Khap panchayat s rape order of 2 up sisters echoes in uk

Dalit sisters rape diktat, Uttar Pradesh's Baghpat district, Supreme Court, Dhama khap, Jats, rape, sisters, punishment, meenakshi, supreme court, Prime minister, PM modi, chief minister akhilesh Yadav, kaap panchayat, jats, shedule caste girls, caste panchayat judgement, national shedule tribe commission,

Jat leaders of a village in Uttar Pradesh's Baghpat district have denied a khap panchayat was ever convened and said no diktat was issued that two Dalit sisters be raped and paraded naked as revenge for their brother's action of eloping with a married woman from their community.

అత్యాచార భయంతో అక్కచెల్లెళ్ళ అజ్ఞాత వాసం.. ప్లేటు ఫిరాయించి కుల పంచాయితీ

Posted: 09/03/2015 09:12 PM IST
Khap panchayat s rape order of 2 up sisters echoes in uk

ఉత్తర్ ప్రదేశ్ లో ఆటవిక రాజ్యం సాగుతుందన్న వాదనలకు ఇది నిదర్శనం. అందుకు కులం పంచాయితీ దోహదపడుతున్నాయనడానికి ఈ ఘటన సాక్ష్యం. అగ్రవర్ణ యువతి ప్రేమించి.. పెళ్లి చేసుకున్న యువకుడి చెలెళ్లను అత్యాచారం చేయాలని, వారిని గ్రామంలో నగ్నంగా తిప్పాలని పంచాయితీలు తీర్పును వెలువరించాయన్న వార్తులు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అంతేకాదు అగ్రవర్ణం అమ్మాయిని వివాహమాడిన యువకుడిని పట్టుకున్న గ్రామస్థులు.. అతడిపై పోలీసు కేసులు బనాయింపజేసి అక్రమంగా జైలుకు పంపించారన్న వార్తలు కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యియి.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పేట్ సమీపంలోని సంక్రోట్ గ్రామం. ఢిల్లీ నగరానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఆ గ్రామంలో జాట్‌లు ఏడువేల మంది ఉండగా, దళితులు 250 మంది ఉన్నారు. మీనాక్షి అన్న 25 ఏళ్ల రవి కుమార్ రెండేళ్ల క్రితం జాట్ కులానికి చెందిన 21 ఏళ్ల కృష్ణ గాఢంగా ప్రేమించుకున్నారు. వారు పెళ్లి చేసుకుంటే జరగబోయే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్రత్యక్షంగా తెలిసిన రవి కుమార్ కుటుంబం అందుకు వారించింది. దీంతో రవి కుమార్ తన ప్రయురాలు కృష్ణకు వేరే పెళ్లి చేసుకోమ్మని నచ్చజెప్పాడు. ఎట్టకేలకు కృష్ణ హర్యానాకు చెందిన తమ కులస్థుడిని వివాహం చేసుకుంది.

కొంతకాలానికి అతనితో కాపురం చేయలేక ఊరికి పారిపోయి వచ్చింది. పాత ప్రేమికులు మళ్లీ కలుసుకున్నారు. రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇది తెలిసిన జాట్ కులస్థులు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి పోలీసుల చేత రవి కుమార్‌ను కొట్టించారు. మాదకద్రవ్యాల కేసులో ఇరికించి మీరట్ జైలుకు పంపించారు. ఊరిలో ఖాప్ పంచాయతీ సమావేశమై రవి కుమార్ ఇద్దరు చెల్లెళ్లను రేప్ చేయాలని, వారి మొఖాలకు మసిపూసి నగ్నంగా ఊరేగించాలని తీర్పు చెప్పింది. అదృష్టవశాత్తు అదే సమయంలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు రవికుమార్ కుటుంబ సభ్యులందరూ ఢిల్లీకి వెళ్లారు. ఊరి నుంచి పొరుగింటి వారు ఫోన్ చేసి ఖాప్ పంచాయతీ తీర్మానం గురించి తెలిపారు. ఊరికి రావద్దని సలహా ఇచ్చారు.

రవికుమార్ పెద్దన్నయ్య సుమిత్ కుమార్ ఢిల్లీలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.  దాంతో ఆయన ఢిల్లీ శివారులో ఓ గుర్తు తెలియనిచోట కుటుంబ సభ్యులను అజ్ఞాతవాసంలో ఉంచారు. వారి జాడ తెలిస్తే.. గ్రామస్థులు అక్కడి చేరుకుంటారని నిత్యం భయపడుతూనే వున్నాడు. మే నెలలో అరెస్టైన రవి కుమార్‌కు జూన్ 26వ తేదీన బెయిల్ వచ్చింది. బయటకు వస్తే ప్రాణాపాయం ఉండడంతో రవి కుమార్ బెయిల్‌పై విడుదల కాకుండా మీరట్ జైల్లోనే ఉంటున్నాడు. సుమిత్ కుమార్ కుటుంబం రక్షణ కోసం న్యాయవాది రాహుల్ త్యాగి సుప్రీం కోర్టులో కేసు వాదిస్తున్నారు. తమ పరిస్థితి, అనుభవిస్తున్న నరక యాతన గురించి ప్రధాన మంత్రికి, ముఖ్యమంత్రికి, మానవ హక్కుల కమిషన్‌కు, షెడ్యూల్డ్ కులాల కమిషన్‌కు లేఖలు రాసినా.. ఎవరి నుంచి ఎలాంటి స్పందన రాలేదని రవికుమార్ సోదరి మీనాక్షి తెలిపారు. దీంతో. చివరకు రక్షణ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించామన్నారు.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయాన్ని వెలువరిస్తుందోనన్న ఆందోళనతో రంగంలోకి దిగిన ఖాప్ పంచాయితీ తాజాగా కొత్త వాదన మొదలుపెట్టింది. అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేయాల్సిందిగా తాము ఆదేశించలేదని ఖాప్ పంచాయతీ సభ్యులు చెప్పారు. అయితే గ్రామంలో మాత్రం తీర్పు మరోలా ఇచ్చిన ఖాప్ పంచాయితీ పెద్దలు.. విషయం సుప్రీం వరకు చేరటంతో పేట్లు ఫిరాయించారు. ఎంతమందిని కలిసినా తమకు న్యాయం జరగడం లేదని, ఊరికి వెళ్తే ఎక్కడ రేప్ చేస్తారోనని అణుక్షణం భయంతో చస్తున్నామని ఆ అక్కాచెల్లెళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఖాప్ పంచాయతీ పెద్దలు కొత్త పల్లవి అందుకున్నారు. అసలు తాము ఆ అక్కా చెల్లెళ్లపై అత్యాచారం చేయాల్సిందిగా ఎప్పుడూ, ఎవరినీ ఆదేశించలేదని చెప్పారు. దీంతో ఈ వివాదం మొత్తం కొత్త మలుపు తిరిగింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  sisters  punishment  meenakshi  supreme court  PM modi  

Other Articles