RTC | Hyderabad | GHMC | Cabinet

Telangana cabinet decided to gave rtc maintainence in the hyderabad range to ghmc

RTC, Hyderabad, GHMC, Cabinet, Hyderabad, TSRTC

Telangana Cabinet decided to gave rtc maintainence in the hyderabad range to GHMC. Telangana cm KCR announce that RTC maintainence will give to GHMC soon.

ఆర్టీసీకి జిహెచ్ఎంసీకి ముడిపెట్టిన కేసీఆర్

Posted: 09/02/2015 08:44 PM IST
Telangana cabinet decided to gave rtc maintainence in the hyderabad range to ghmc

ఆర్టీసీ గురించి ఎవరిని అడిగినా.. ముందు చెప్పేది ఆర్టీసీకి వస్తున్న నష్టాల గురించే. ఎంతో కాలంగా వింటూ వస్తున్న ఆర్టీసీ నష్టాల మీద ఇప్పటి వరకు వచ్చిన అన్ని ప్రభుత్వాలు తూతూ మంత్రంగా చర్యలకు దిగాయి. ఎన్ని సార్లు, ఎన్ని కమిటీలు ఆర్టీసి ప్రభుత్వం ఊతమివ్వాలని నివేదికలు సమర్పించినా కానీ ఎలాంటి మార్పు రాలేదు. అయితే ఆర్టీసీ మీద ముందు నుండి విజన్ ఉన్న కేసీఆర్.... తెలంగాణ ఆర్టీసీని నష్టాల కడలి నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. కర్ణాటక మాదిరిగా టిఎస్ఆర్టీసీని కూడా స్థానిక సంస్థలకు అప్పగించి లాభాల బాటలో నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ మొత్తాన్ని ఉద్దరించడం ఇప్పటికిప్పుడు సాధ్యంకాని నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆర్టీసీ మీద కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ మధ్యాహ్నం నుండి ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్ ఆర్టీసి నష్టాల మీద కూడా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ పరిధిలొ ఉన్న ఆర్టీసీ మీద ప్రకటన చేశారు. ఆర్టీసీ 218 కోట్ల నష్టంతో నడుస్తోందని..హైదరాబాద్‌లో ఆర్టీసీకి వచ్చే నష్టాన్ని జీహెచ్‌ఎంసీ భరించాలని కేబినెట్ నిర్ణయించిందని వెల్లడించారు. హైదరాబాద్‌లో 3,800 బస్సులు నడుస్తున్నయని అన్నారు. టీఎస్‌ఆర్టీసీ లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ బోర్డు డైరెక్టరేట్‌గా ఉంటారన్నారు. మొత్తానికి ఆర్టీసీని కష్టాల కడలి నుండి తప్పించేందుకు కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీకి భారాన్ని తగ్గించడమే కాకుండా జిహెచ్ఎంసీ పరిధిలో ఆర్టీసీ సేవలను మరింత విసృతం చెయ్యడానికి సహకరిస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RTC  Hyderabad  GHMC  Cabinet  Hyderabad  TSRTC  

Other Articles