supreme court dismisses union minister Sujana chowdary petition

Supreme court jolt to sujana chowdary his firm faces liquidation

Sujana Universal Industries, Sujana chowdary, union minister Sujana chowdary, tdp leader Sujana chowdary, Sujana chowdary business man, 106 crore loan, availed, Mauritius, Heistia Company, supreme court

TDP MP and Union Minister Sujana Choudhary get a setback in the Supreme Court today .Few days before Hyderabad high court' found fault with Sujana's company for its failure to repay loan amounting to Rs 105 crore.

సుజనాji సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..ఆస్తులమ్మైనా అప్పు చెల్లించాలి..

Posted: 09/02/2015 06:15 PM IST
Supreme court jolt to sujana chowdary his firm faces liquidation

కేంద్ర మంత్రి, తెలుగుదేశం నాయకుడు, ప్రముఖ పారిశ్రామిక‌వేత్త సుజనాచౌదరికి టైం బాగోలేనట్టుగా వుంది. ఆయనకు కేంద్ర మంత్రి పదవి వచ్చిన నాటి నుంచి కాలం కలసివచ్చనట్లు లేదు. ప్రస్తుతం ఆయనకు న్యాయస్థానాల్లో దెబ్బ మీద దెబ్బ తాకుతోంది. తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆయనపై కొరడా ఝుళిపించింది. సుజనా యూనివర్సల్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ పేరుతో ఒక విదేశీబ్యాంకు నుంచి తీసుకున్న రూ.106 కోట్ల అప్పును నెలరోజుల్లోగా తీర్చాలంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఒకవేళ రుణాన్ని తిరిగి చెల్లించని పక్షంలో తన సంస్థ ఆస్తుల్ని అమ్మైనా వసూలు చేయాల్సిందేనన్నది ప్రత్యర్థి మారిషెస్ కమర్షియల్ బ్యాంకుకు పట్ల సానుకూల తీర్పునిచ్చింది.

2014లో మారిషస్‌కు చెందిన మారిషెస్ కమర్షియల్ బ్యాంకు.. సుజనా సంస్థ తమను మోసం చేసిందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 92 కోట్ల రూపాయలను హైస్టియా హోల్డింగ్ లిమిటెడ్ పేరుతో రుణాన్ని తీసుకుందని.. అప్పటి నుంచి అసులు సహా వడ్డీకి కూడా కట్టలేదని చెప్పింది. అపరాధ రుసుముతో కలిపి అది రూ.106 కోట్లు అయ్యిందని సదరు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇటీవల ఈ కేసును తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో విచారణ జరిగింది. సెప్టెంబర్ 30 లోపు సుజనా సంస్థ సదరు మొత్తాన్ని చెల్లించాలని హైకోర్టు తీర్పును వెలువరించింది.

హై కోర్టు తీర్పును సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుజనా సంస్థల అధికారులు. ఈ కేసుపై విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు వెలువరించిన తీర్పుతో ఏకభవిస్తూ.. ఈ నెల చివరి నాటికి 106 కోట్ల రూపాయలను చెల్లించాలని, ఒకవేళ డబ్బులేని పక్షంలో సుజనా సంస్థ అస్తులను విక్రయించైనా చెల్లించాలని తీర్పునిచ్చింది. ఇప్పుడు ఈ కేసు నుంచి సుజనా సంస్థ అధినేత బయటపడని పక్షంలో వ్యాపారపరమైన ఇబ్బందులతోపాటు రాజకీయంగా కూడా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఇటు దేశీయ, అటు విదేశీ బ్యాంకులను కోట్ల రూపాయల మేరకు ముంచిన సుజనకు కేంద్ర మంత్రి పదవి ఎలా కట్టబెడతారని, ఇదే బిజేపి ప్రభుత్వం నిజాయితీని స్పష్టం చేస్తుందని కాంగ్రెస్ విమర్శలు, అరోఫణల పర్యానికి తెరలేపిన విషయం తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sujana Universal Industries  Sujana chowdary  supreme court  

Other Articles