Petrol | Diesel | Petrol Price cut

Petrol price cut by rs 2 rupess per lire and diesel by 50 paise per litre

Petrol, Diesel, Petrol Price cut, Price cut, India

Petrol Price Cut by Rs 2 rupess per lire and Diesel by 50 Paise per Litre Petrol price on Monday was cut by Rs 2 per litre while diesel rate was reduced by 50 paise a litre - the third reduction in rates this month following global cues. The new rates will be effective from the midnight of August 31 and September 1.

తగ్గిన పెట్రోల్, డిజిల్ ధరలు

Posted: 09/01/2015 08:38 AM IST
Petrol price cut by rs 2 rupess per lire and diesel by 50 paise per litre

పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. లీటరు పెట్రోలుపై 2 రూపాయలు, డీజిల్‌పై 50 పైసలు తగ్గిస్తూ చమురు కంపెనీల నిర్ణయించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పతనమవడంతో మరోసారి పెట్రోలియం ఉత్పత్తుల ధరల్ని తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. ఇవాళ అర్థరాత్రి నుంచి తగ్గిన ధరలు అమల్లోకి రానున్నాయి. తాజా ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోలుకు 61 రూపాయలు కాగా, డీజిల్ 44 రూపాయల 45 పైసలుగా ఉండనుంది. ఆగస్టు 14న సవరించిన ధరల్లోనూ లీటరు పెట్రోలుకు రూపాయి 27 పైసలు తగ్గించగా, డీజిల్‌పై రూపాయి 17 పైసలు తగ్గించారు. 30 రోజుల వ్యవధిలో పెట్రోలు, డీజిల్ ధరలు రెండోసారి తగ్గినట్లయింది.  

తాజా తగ్గింపుతో ఢిల్లీ మార్కెట్లో లీటరు పెట్రోల్ 63.20 నుంచి 61.20కి జారుకుంది. అలాగే డీజిల్ రేటు  44.95 నుంచి 44.45కు తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనంపై విధించే స్థానిక పన్నులకు అనుగుణంగా ఆయా నగరాలకు వర్తించే పెట్రో ధరల తగ్గుదల రేటు వేర్వేరుగా ఉంటుంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 2.16, డీజిల్‌పై 54 పైసలు తగ్గింది. దీంతో లీటరు పెట్రోల్ ధర 68.45 నుంచి 66.29కు తగ్గింది. డీజిల్ రేటు 48.99 నుంచి 48.45కు జారుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు, డాలర్-రూపాయి మారకం రేటులో హెచ్చుతగ్గులకు అనుగుణంగా ప్రతిపదిహేను రోజులకోసారి ఇంధన సంస్థలు పెట్రో ధరలను సవరిస్తుంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  Diesel  Petrol Price cut  Price cut  India  

Other Articles