The Hollywood Actresses Nude Photos Case Completes One Year But Yet Not Find Criminals | FBI Investigation | Jennifer Lawrence

Hollywood actresses nude photos leak case fbi investigation one year complete

hollywood actresses nude photos, actresses nude photos case, jennifer lawrence, jennifer lawrence nude photos leak, actresses nude photos leak, nude photos leak cases, fbi investigation, fbi on nude photos leak, apple cloud, apple company

Hollywood Actresses Nude Photos Leak Case FBI Investigation One Year Complete : The Case Of The Hollywood Actresses Nude Photos Leakage Has Completes One Year But Yet To Find Criminals. FBI Still Investigating On This Case. Jennifer Lawrence Demands To Punish Those Who Did This Crime.

హీరోయిన్ల న్యూడ్ ఫోటోల కేసు.. ‘పెండింగ్’లోనే!

Posted: 08/31/2015 07:26 PM IST
Hollywood actresses nude photos leak case fbi investigation one year complete

సరిగ్గా ఏడాది క్రితం.. జెన్నిఫర్ లారెన్స్ తోపాటు మరికొందరు హాలీవుడ్ తారలకు సంబంధించిన నగ్నచిత్రాలు హ్యాకింగ్ కు గురై లీకయ్యాయి. వాళ్ల న్యూడ్ ఫోటోలు లీక్ అవడమే ఆలస్యం.. ఇంటర్నెట్ లో వాటిని తరించేందుకు నెటిజన్లు ఒక్కసారిగా పడ్డారు. ఆమధ్య ఈ లీకేజ్ ఘటన పెద్ద సంలచనంగా మారింది. అంతేకాదు.. మరికొన్నాళ్ల తర్వాత రష్యాకు చెందిన ఓ మహిళా మంత్రి, యూరోప్ చెందిన మరో మోడల్ నగ్న ఫోటోలూ లీకయ్యాయి. దాంతో వాళ్లు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వెంటనే ఆ ఫోటోలను హ్యాక్ చేసి, లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. ఈ విధంగా ఫోటోలను లీక్ చేయడం.. సెక్స్ నేరం కిందకే వస్తుందని, దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని జెన్నిఫర్ లారెన్స్ బహిరంగంగా డిమాండ్ చేసింది.

వెంటనే స్పందించిన ఎఫ్‌బీఐ అధికారులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఎంతోమంది ఐపీ చిరునామాలు గాలించారు.. ఎన్నో కంప్యూటర్లను స్వాధీనం కూడా చేసుకున్నారు. కానీ.. ఇప్పటికీ ఆ లీకేజ్ దోషులను మాత్రం ఎఫ్‌బీఐ పట్టుకోలేకపోయింది. కేసు ఇప్పటికీ తెరిచే ఉందని, మూసేయలేదని ఎఫ్‌బీఐ అధికారులు సెలవిచ్చారు కూడా! ఇదిలావుండగా.. 2014 ఆగస్టు 31వ తేదీన హ్యాకర్లు ఆపిల్ ‘ఐక్లౌడ్’ ఖాతాలను హ్యాక్‌ చేసి, కొంత మంది హాలీవుడ్ హీరోయిన్ల నగ్న చిత్రాలను బయటకు లాగారు. వాళ్లకు సంబంధించిన కొన్నివేల చిత్రాలను వివిధ వెబ్‌సైట్లలో పోస్ట్ చేశారు. ఇది అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించింది. ఇక ఈ ఘటనపై స్పందించిన ఆపిల్ సంస్థ.. తమ సర్వర్లు పటిష్ఠంగానే ఉన్నాయని, తమ సర్వర్ల ద్వారా ఈ ఫొటోలు బయటకు పోలేదని తెలిపింది. ఖాతాదారులు ఇచ్చిన బలహీనమైన పాస్‌వర్డ్స్ ద్వారానే ఈ నేరం జరిగిందని ఆపిల్ వివరణ ఇచ్చుకుంది.

ఆ నాటి అనుభవంతో ఆపిల్ ‘ఐక్లౌడ్’ రెండంచెల భద్రతా వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇతరులు కొంత కష్టపడితే కనిపెట్టే పాస్‌వర్డ్స్‌ను ఇవ్వకూడదని, సులభంగా గుర్తుంటుందని భావించి పుట్టినరోజుతోనో, పుట్టిన ప్రాంతంతో, ఈ మెయిల్ చిరునామాతో పాస్‌వర్డ్స్ ఇవ్వరాదని సూచించింది. పక్కవారు కూడా కనిపెట్టలేని విధంగా పాస్‌వర్డ్స్ ఉండాలని చెప్పింది. ఎడల్ట్ డేటింగ్ వెబ్‌సైట్ ‘ఆస్లీ మాడిసన్’ మరో వెబ్‌సైట్ ‘సోని పిక్చర్స్’ను ఇటీవల హ్యాకర్లు హ్యాక్ చేసిన నేపథ్యంలో సెక్యూరిటీ పాస్‌వర్డ్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆపిల్ కంపెనీ హెచ్చరించింది. ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా విశ్వసించదగ్గవి మాత్రమే కొనుగోలు చేయాలని సూచించింది. ఏదిఏమైనా.. ఫోటోలు లీకేజ్ కేసు ఇంకా కొలిక్కి రాకపోవడంతో హాలీవుడ్ తారలు మండిపడుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : hollywood actresses nude photos  fbi investigation  apple cloud  

Other Articles