Hardik Patel | Patel reservation | patidar

Hardik tries to scale up his agitation to national level

Hardik Patel, Patel reservation, patidar, Gujarat, Reservations

Hardik tries to scale up his agitation to national level Prime Minister Narendra Modi invoked Sardar Patel and Mahatma Gandhi in his radio broadcast Mann ki Baat, to express his worry over the violence last week in Gujarat. This was even as Hardik Patel leader of the Patidar Anamat Sanghursh Samiti (PASS) was invoking the Sardar as the icon behind a nationwide agitation demanding reservation for an umbrella of communities from Gujjars to Jats on his visit to Delhi.

ఇక తాడో పేడో తేలిపోవాలంటున్న హార్దిక్ పాటిల్

Posted: 08/31/2015 03:52 PM IST
Hardik tries to scale up his agitation to national level

గుజరాత్‌ పటేళ్ల రిజర్వేషన్‌ పోరాటం జాతీయ రూపం తీసుకోనుంది. ఇకపై దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్వహించనున్నట్లు గుజరాత్‌లో పటేల్ కులస్థుల పోరాటానికి నేతృత్వం వహిస్తున్న హర్దీక్ పటేల్ తెలిపారు. గుజ్జర్లు, కుర్మీలు సహా వివిధ కులాలకు చెందిన సుమారు 27 కోట్ల మంది ప్రజలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. వివిధ కులాల నాయకులతో వరుస చర్చలు జరిపిన ఈ 22ఏళ్ల యువకుడు రిజర్వేషన్ల ఉద్యమం మారథాన్ రన్ వంటిదని, వంద మీటర్ల పరుగు పందెం వంటిది కాదని వ్యాఖ్యానించారు.

‘‘ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక రచన కోసం ఢిల్లీ వచ్చా ను. కేంద్రమంత్రుల ను కలిసే ఉద్దేశం లేదు’’ అని స్పష్టం చేశారు. పటేళ్ల పోరాటానికి మద్దతిచ్చే ప్రతి వ్యక్తి, ప్రతి సమూహం, ప్రతి సంస్థతో చర్చిస్తామన్నారు. ‘గుజరాత్‌’ మోడల్‌లో తమ దగ్గరా ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని 12 రాష్ర్టాల్లోని పటేళ్లు చెబుతున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా పటేళ్ల ఐక్యతకు పిలుపునిస్తూ, త్వరలో లఖ్‌నవ్‌, ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద భారీ సభలు నిర్వహించే యోచన ఉందని వివరించారు. ప్రతి కులంలోని పేదలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రిజర్వేషన్ల వల్ల దేశం 60 ఏళ్లు వెనక్కిపోయిందని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hardik Patel  Patel reservation  patidar  Gujarat  Reservations  

Other Articles