Jagan | Roja | Ap | Assembly

Ysrcp mla roja slams chandrababu naidu and his govt

Jagan, Roja, Ap, Assembly, assembly sessions, chandrababu naidui, Godavari Pushkaralu, Rishiteshwari

YSRCP MLA Roja slams Chandrababu Naidu and his govt. She said that the speaker didnt give opportunity to speak to jagan in ap assembly.

ITEMVIDEOS: రోజమ్మా.. అది నిజమే కానీ వెటకారం ఎక్కువైంది..!

Posted: 08/31/2015 01:43 PM IST
Ysrcp mla roja slams chandrababu naidu and his govt

నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి చంద్రబాబు నాయుడు మీద ఏపి ప్రభుత్వం మీద మాటల తూటాలు పేల్చారు. అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ను మాట్లాడనీయకుండా మైక్ కట్ చేస్తున్నారని చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని రోజా ప్రశ్నించారు. అయితే చంద్రబాబు నాయుడు మీద మాటల తూటాలు పేలుస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే మామూలుగా మాట్లాడితే ఏముంటుంది అని ఆలోచించారో ఏమో కానీ.. రోజా మాటల్లో చంద్రబాబు నాయుడు మీద వెటకారం బాగా కనిపించింది. సామెతలతో రోజా చంద్రబాబును విమర్శించిన తీరు డిఫరెంట్ గా అనిపించింది. వైసీపీ నాయకుల్లో ఎవరూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. కానీ రోజా మేడం మాత్రం మీడియా ముందుకు వచ్చి పార్టీ తరఫున తన గళాన్ని వినిపించారు. రిషితేశ్వరి దగ్గరి నుండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వరకు అన్నింటి మీదా ప్రభుత్వాన్ని నిలదీస్తామని రోజా వెల్లడించారు.

జగన్ కు అసెంబ్లీ కొత్త అని టీడీపీ నేత బోండా ఉమ అనడాన్ని ఆమె తప్పుబట్టారు. బోండా ఉమ ఏమైనా 10 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారా? అని ప్రశ్నించారు. కేవలం మోదీపై ఉన్న క్రేజ్, పవన్ కల్యాణ్ పై ఉన్న అభిమానంతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఈ రోజు పవన్ కు టీడీపీ భయపడాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. టీడీపీకి అంత సీన్ ఉంటే, ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పవన్ ఇంటి ముందు పడిగాపులు ఎందుకు పడ్డారని అన్నారు. ఒక వైపు పుష్కర తొక్కిసలాటపై చర్చిద్దామంటూనే, మరోవైపు జగన్ ను మాట్లాడనీయకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రత్యేక హోదా గురించి ప్రకటన చేస్తామని, మీరెందుకు తొందరపడుతున్నారని చంద్రబాబు అంటున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికే బీజేపీ కాళ్ల వద్ద రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టుపెట్టారని విమర్శించారు. ఈ మధ్యనే 'కోడలు మగ బిడ్డను కంటానంటే, అత్త వద్దంటుందా?' అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూడా రోజా తప్పుబట్టారు. మహిళలు అంటే చంద్రబాబుకు అంత చులకనా? అని మండిపడ్డారు. అమ్మణ్ణమ్మ లేకపోతే చంద్రబాబు పుట్టేవారా? భువనేశ్వరి లేకపోతే చంద్రబాబుకు లోకేష్ అనే వారసుడు ఉండేవాడా? అని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన సమయంలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ రోజా ఈ వ్యాఖ్యలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagan  Roja  Ap  Assembly  assembly sessions  chandrababu naidui  Godavari Pushkaralu  Rishiteshwari  

Other Articles