Agains War Of Words Began Between AP CM Chandrababu Naidu And YS Jagan IN AP Assembly Sessions | TDP | YSRCP

Chandrababu naidu ys jagan war of words ap assembly sessions

chandrababu naidu, ys jagan, godavari pushkaralu, ap special status, andhra pradesh capital city, amaravathi master plan, chandrababu controversies, ys jagan controversies, ys jagan mohan reddy updates, ap assembly sessions

Chandrababu Naidu YS Jagan War Of Words AP Assembly Sessions : Agains War Of Words Began Between AP CM Chandrababu Naidu And YS Jagan IN AP Assembly Sessions.

అసెంబ్లీకి ఏమైంది.. ఓవైపు జగన్, మరోవైపు బాబు?

Posted: 08/31/2015 12:37 PM IST
Chandrababu naidu ys jagan war of words ap assembly sessions

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన తొలిరోజు రగడ, రగడగానే కొనసాగుతోంది. ఈసారైనా అసెంబ్లీ తీరు మారుతుందని భావిస్తే.. గతంలో జరిగిన దానికంటే మరింత ఆందోళనకరంగా జరుగుతోంది. ఏపీ ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. ప్రతి అంశంపైనా మరింత లోతుగా వెళ్లకుండా తెలివిగా ప్రభుత్వం తప్పించుకుంటోంది. కేవలం గంట వ్యవధిలో మూడు సంతాప తీర్మానాలను ఆమోదించిన సభ వాయిదా పడిందంటే.. అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు ఏ స్థాయిలో నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొదట మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు నివాళులు అర్పించి, సంతాప తీర్మానం ఆమోదించే వరకూ సభ సజావుగానే సాగింది. ఇక ఆ తర్వాత మొత్తం రగడే!

గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారికి సంతాపం తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ దారుణం జరిగిపోయిందని చంద్రబాబు చెప్పడంపై ఆయన మండిపడ్డారు. బాబు వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని విమర్శించారు. కేవలం ప్రచారం కోసమే బాబు వీఐపీ ఘాట్ లో కాకుండా సాధారణ ఘాట్లో పుష్కరస్నానం ఆచరించారని అన్నారు. దీన్నంతా షూటింగ్ కూడా చేశారని చెప్పారు. చంద్రబాబు ప్రచార ఆర్భాటమే ఇంతమంది ప్రాణాలను బలిగొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. మృతుల కుటుంబాలకు ఇంతవరకు నష్ట పరిహారం అందలేదని జగన్ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన ప్రత్యేకహోదా కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వారి ప్రస్తావనను తీసుకొచ్చారు. హోదా ఆలస్యమైందని యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదని, తెలుగుదేశం, బీజేపీ నేతలు చేస్తున్న అడ్డగోలు స్టేట్ మెంట్లతో మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ విధంగా జగన్ విమర్శించడంతో.. ఆయనపై బాబు ప్రత్యక్ష దాడికి దిగారు.

నోరుందని అడ్డదిడ్డంగా మాట్లాడితే, రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని జగన్ కు బాబు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే విభజన జరిగిన తీరును మరోసారి గుర్తు చేశారు. విభజన జరుగుతున్న సమయంలో వైఎస్ జగన్ పార్లమెంటులో ఎక్కడ దాక్కున్నారని తీవ్రంగా విమర్శించారు. హోదా కోసం తాము తీవ్రంగా శ్రమిస్తున్నామని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోరాదని కోరారు. హౌస్ లో గొడవ పెట్టి, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు మాత్రమే విపక్షాలు చూస్తున్నారని, చర్చించే ధైర్యం వీళ్లకు లేదని నిప్పులు చెరిగారు. తమకు అధికారం ముఖ్యం కాదని, రాష్ట్రాన్ని కాపాడే శక్తి తెదేపాకు తప్ప ఎవరికీ లేదని భావించిన మీదటే ప్రజలు అధికారం ఇచ్చారని అన్నారు. హత్యలు చేయడం వైకాపాకు అలవాటని, ప్రజలను కాపాడేది తామేనని తెలిపారు. అసెంబ్లీని స్తంభింపజేస్తే ప్రజల్లో మంచి పేరు వస్తుందని భమ పడుతున్నారని విమర్శించారు. ప్రతిదానికీ తనపై బురద జల్లినంత మాత్రాన వాళ్లే చులకనైపోతారని హెచ్చరించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  ys jagan mohan reddy  ap assembly sessions  ap special status  

Other Articles