abused images in banjara hills police station facebook page

Banjara hills police negligence in operating facebook

banjara hills police station, facebook, abused images, nude photos of murdered lady, lasy dead body photos, hyderabad police commisionerate, mahinder reddy, banjara hils police facebook

banjara hills police negligence in operating facebook arise critics from public as abused images uploaded in police station facebook page

బంజారా హిల్స్ పోలీసుల ‘ఫేస్’ బుకయ్యింది...

Posted: 08/30/2015 01:19 PM IST
Banjara hills police negligence in operating facebook

పోలీసులు.. ప్రజలకు మిత్రులు.. కేవలం నేరస్తులకు మాత్రమే వారు శత్రువుల్లా కనబడతారు. మీరు ధైర్యంగా వుండి పోలీసులు మీ వద్ద జరిగిన సమాచారాన్ని తెలపండి. లేదా.. సాంకేతిక విప్లవంతో అందుబాటులోకి వచ్చిన షేస్ బుక్ లో పిర్యాదులను తెలపండి అంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలకు చేరువయ్యేందుకు యత్నించిన బంజారాహిల్స్ పోలీసులకు చుక్కెదురయ్యింది. ఫేస్‌బుక్‌లో బంజారాహిల్స్ పీఎస్ పేరిట రూపొందించిన పేజీలో అశ్లీల చిత్రాలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నెల 28న 42 నుంచి 45 ఏళ్ల వయస్సున్న ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహానికి సంబంధించిన నగ్న చిత్రాలు ఫేస్‌బుక్ పేజీలో ఒక వ్యక్తి అప్‌లోడ్ చేయడమే ఇందుకు కారణంగా మారింది.

అయితే అప్ లోడ్ అయిన ఫోటోలను ఇప్పటి వరకు పోలీసులు పట్టించుకోకపోవడం.. వాటిని సదరు సైట్ నుంచి తొలగించకపోవడంతో పై విమర్శలు వస్తున్నాయి. ప్రజల నుంచి సలహాలు, సూచనల కోసం ఏర్పాటుచేసిన ఈ పేజీని ఎనిమిది నెలల క్రితం ప్రారంభించినమాట వాస్తవమేనని... నాలుగు నెలలుగా దాన్ని వాడటం లేదని పోలీసులు చెబుతున్నారు. గత నాలుగు నెలలుగా పీఎస్ బంజారాహిల్స్ పేరుతో కొత్త ఫేస్‌బుక్ పేజీని ప్రారంభించి... ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తున్నామని అంటున్నారు. తొలి ఫేస్‌బుక్ పేజీని అనుసరిస్తున్న నగరవాసులు ఈ చిత్రాలపై మండిపడుతున్నారు. పాత ఎఫ్‌బీ అకౌంట్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : banjara hills police station  facebook  abused images  

Other Articles