invasion of the students come to the camp office of the chief of police baton

Police brutal beatenup left parties students wing leaders

police brutaljy beatsup left parties students wing leaders, private universities, CM Camp office, left students wings, police, brutal attack, students attacked by police

left parties students wing protest turned down as police brutal beatenup left parties students wing leaders at AP CM camp office

వాళ్లు కారినాత్ములే.. విద్యార్థులపై ఇలా విరుచుకుపడతారా..?

Posted: 08/30/2015 01:16 PM IST
Police brutal beatenup left parties students wing leaders

ఉద్యమాలను అణిచివేస్తే.. అవి ఇంకా తీవ్రస్థాయికి చేరుతాయని పోలీసులకు తెలుసు. అయినా సరే.. ఉద్యమాలను, అందోళలను, నిరసనలను ఎక్కడికక్కడ ఉక్కుపాదంతో అణిచివేస్తుంటారు. కాఠిన్యం, కర్కషత్వమే తప్ప.. తమకు మరోకటి తెలియదన్నట్లు విద్యార్థులను అతి దారుణంగా హింసించిన ఫోటోలు.. పోలీసులు అణచివేతనకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడికి వచ్చిన విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. బూటు కాళ్లతో విద్యార్థుల ముఖాలపై తొక్కారు. పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు.

లాఠీలతో చావబాదారు. ఆడ, మగ తేడా లేకుండా జుట్టు పట్టుకొని మరీ రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనతో సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. శనివారం కార్యాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుండటంతో పోలీసులు అటువైపు ఎవరినీ అనుమతించలేదు. సీఎం క్యాంపు కార్యాలయం నలువైపులా భారీగా మోహరించారు. కొందరు విద్యార్థులు హఠాత్తుగా సీఎం క్యాంపు కార్యాలయం సమీపానికి దూసుకువచ్చి నినాదాలు ప్రారంభించడంతో కంగుతిన్న పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి కె.వసంత్‌ను రోడ్డుపై పడదోసినా నినాదాలు చేస్తుండటంతో బూటుకాలుతో నుదుటిపై తన్నారు.  

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : private universities  CM Camp office  left students wings  police  brutal attack  

Other Articles