Bombay High court | Ganesh mandap

Bombay high court opines celebration of all festivals on roads should be stopped

Bombay, Bombay High court, Mumbai, ganesh festival, Ganesh mandap

Bombay High Court opines celebration of all festivals on roads should be stopped The Bombay High Court today slammed organisations and persons putting up pandals on public roads during Ganesh Utsavs, Navratri and other festivals and said "these pandals are just extorting money."

గణేశ్ ఉత్సవాలపై హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు

Posted: 08/29/2015 12:47 PM IST
Bombay high court opines celebration of all festivals on roads should be stopped

గణేశ్ ఉత్సవాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముంబై, పూనా, హైదరాబాద్ లలో జరిగే ఉత్సవాలను చూడడానికి రెండు కళ్లు చాలవు. అయితే ఇదంతా ఒక కోణంలో మాత్రమే. మరోకోణంలో మాత్రం ఉత్సవాల కారణంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రజలు తమకు ఇష్టం ఉన్నా లేకున్నా కానీ గణేశ్ చందాలు ఇవ్వాల్సి వస్తుంది. అయితే తాజాగా ముంబై హైకోర్ట్ న్యాయమూర్తులు సంచనల వ్యాఖ్యలు చేశారు. దేశంలో జరుగతున్న గణేశ్ ఉత్సవాల మీద చేసిన సంచలన వ్యాఖ్యల మీద సర్వత్రా చర్చ సాగుతోంది. మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న గణేశ్  ఉత్సవాల నేపథ్యంలో హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు చెయ్యడం విశేషం.

వీధకి పది గణేశ్ మండపాలు, పెద్ద పెద్ద సౌండ్ లు చేస్తూ హడావిడి.. గణేశ్ ఉత్సవాల పేరుతో ప్రజల నుండి భారీగా వసూళ్లు.. ఇది ఉత్సవాల తీరు. ఒక్క గణఏశ్ ఉత్సవాల్లోనే కాదు.. నవరాత్రి ఉత్సవాలు. అవీ ఇవీ అన్ని అంతే. అయితే ఈ తీరు మీద హైకోర్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు వీధిలో అన్ని విగ్రహాలు ఎందుకు.. నగరంలో రద్దీ పెరిగిపోయేలా అంత హడావిడి ఎందుకు అని ప్రశ్నించారు న్యాయమూర్తులు. వీధికో మండపం పెట్టుకొని .. హడావిడి లేకుండా నిశబ్దంగా పూజలు చేసుకుంటే సరిపోతుంది కదా అని హైకోర్ట్ న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఒకవేళ లోకమాన్య తిలక్ బ్రతికే ఉంటే నేడు జరుగుతున్న గణేశ్ ఉత్సవాల తీరు మీద మండిపడే వారని న్యాయమూర్తులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. మొత్తానికి గణేశ్ ఉత్సవాల మీద హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు సర్వత్రా చర్చకు తెర తీశాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bombay  Bombay High court  Mumbai  ganesh festival  Ganesh mandap  

Other Articles