Jagan | AP | Bandh | Special status

Ysrcp party called for ap bandh to allot special status

Jagan, AP, Bandh, Special status, YSRCP, AP Bandh

YSRCP Party called for ap bandh to allot special status. Jagan call for Bandh to bring special status for the state of ap.

ITEMVIDEOS: ప్రత్యేకం కోసం ఏపి బంద్.. టెన్షన్ టెన్షన్

Posted: 08/29/2015 08:17 AM IST
Ysrcp party called for ap bandh to allot special status

ప్రత్యేక హోదా పై ఏపీ లో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మభ్య పెట్టేందుకు కృషి చేస్తోందని ఆరోపిస్తూ.. వైఎస్ ఆర్ సీపీ రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపు నిచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో బంద్ మొదలైంది. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని నినదిస్తూ.. వైఎస్ ఆర్ శ్రేణులు రోడ్డు ఎక్కారు. ఉదయం నుంచే బంద్ పాటించేలా వీధుల్లో ప్రచారం చేస్తున్నారు. దుకాణాలు, హోటళ్లు మూసివేయాలని కోరుతున్నారు. వామపక్షాలు, విద్యార్థి సంఘాలు, కార్మికసంఘాలు ఈ రాష్ట్ర వ్యాప్త బంద్‌- క మద్దతు ప్రకటించాయి. కాగా, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాజేకీ ఏమీ రాకపోయినా రాష్ట్రానికి భారీ ఎత్తున నిధులు వస్తాయని చంద్రబాబు సర్కార్ చేస్తున్న ప్రచారం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఇప్పటి కే ప్రత్యేక ప్యాకేజీ రాకపోవడంతో మనస్థాపం చెంది ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారు.



మరోవైపు బంద్‌ను విజయవంతం చేయాలన్న సందర్భంలో వైసీపీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయ్‌. బస్సుల అద్దాలు పగలగొట్టాలనీ, పోలీసులకు భయపడాల్సిన పనిలేదనీ, కేసులు తమకేమీ కొత్తకాదనీ, జగన్ సీఎం కాగానే కేసుల్ని రద్దు చేస్తారనీ డైలాగ్స్ పేల్చారు. దీనిపై బెజవాడ పోలీసులు ఘాటుగానే రియాక్ట్‌ అయ్యారు. బంద్ సందర్భంగా... హింసాత్మక ఘటనలు జరిగితే సహించేది లేదంటూ ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేశారు. శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా చర్యలు తీసుకుంటామంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagan  AP  Bandh  Special status  YSRCP  AP Bandh  

Other Articles