AP CM Chandrababu Naidu Give Strong Warning To Govt Officials | Injection Psycho | Rat Bites Child Incident

Ap cm chandrababu naidu strong warning to govt officials injection psycho rat bites child

chandrababu naidu, chandrababu updates, chandrababu press meet, rat bites child, injection psycho, ap controversies, amaravathi, ap capital city

AP CM Chandrababu Naidu Strong Warning To Govt Officials Injection Psycho Rat Bites Child : AP CM Chandrababu Naidu Give Strong Warning To Govt Officials.

‘ఆ’ చంద్రబాబు.. Coming Soon!

Posted: 08/28/2015 10:22 AM IST
Ap cm chandrababu naidu strong warning to govt officials injection psycho rat bites child

ఇదేదో సినిమా టైటిల్ కాదు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నోటినుంచి జాలువారిన ఓ హెచ్చరిక! ఇటువంటి హెచ్చరికలు ఆయన ఇప్పటికే ఎన్నోసార్లు ఇచ్చారు కదా.. ఇందులో ప్రత్యేకం ఏముంది? అని అనుకుంటున్నారా..! అలా అనుకోవడం అనాలోచితమే! అయినా ఈ వార్నింగ్ ఇచ్చింది ప్రతిపక్ష పార్టీలకు కాదు.. ఏపీ ఉద్యోగులకు! వాళ్లకు ఆ హెచ్చరిక ఇవ్వడం వెనుక ఓ బలమైన కారణం కూడా వుంది. ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్నో లోపాలు వెలికి వచ్చాయి. రాజధానిలేని ఈ రాష్ట్రాన్ని తన రాజకీయ అనుభవంతో అభివృద్ధి బాట పట్టించేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వీలైనంతవరకు ఇతర దేశాలకు వలసలకు వెళ్లి.. అక్కడి పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. తాను ఇంతగా కష్టపడుతున్నా, అధికారుల నుంచి ఆ స్థాయి సహకారం అందడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఏమాత్రం కష్టం పడకుండా.. ‘ఏదో వచ్చామా, కాసేపు కూర్చున్నామా.. సహోద్యోగులతో సరదాగా గడిపామా.. ఇంటికి వెళ్లామా’ అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు. అందుకే.. వీలైనంత త్వరగా ఉద్యోగులు తమ పనితీరు మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు. ‘పనిచేసే వారే నా దగ్గర ఉంటారు. పనిచేయని వారిని ఉపేక్షించేది లేదు’ తేల్చి చెప్పేశారు.

విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన బాబు.. గుంటూరు ఆస్పత్రి ఘటన, ఇంజక్షన్ల సైకోపై, ఇంకా తదితర ఘటనలపై ఘాటుగా స్పందించారు. ‘గతంలో మాదిరిగా కాకుండా ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నా. అయితే, నేను ఎంత కష్టపడుతున్నా.. ఉద్యోగుల నుంచి ఆ స్థాయి కృషి జరగడం లేదు. ఉద్యోగులు నిరక్ష్యంగా వ్యవహరించినా గతంలో సహించేవాడిని కాదు. కొందరు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మొద్దు నిద్రను వదిలించేందుకు సన్నద్ధంగా ఉన్నాను. ఉద్యోగుల విషయంలో మరో 3 నెలల్లో పాత చంద్రబాబు ఫెర్ ఫార్మెన్స్ చూస్తారు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మరి.. బాబు ఇచ్చిన ఈ వార్నింగ్ తోనైనా అధికారులు మారుతారో, లేదో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  amaravathi  injection psycho  

Other Articles