another person commits suicide for AndhraPradesh special status

Man commits suicide for special status to ap

Ramisetti Lakshmiah, hanged himself to death, Keshavulu Nagar, Vedayapalem, Nellore, special status to Andhra Pradesh, Tirupathi, kama munikoti, set ablaze, Andhra Pradesh, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird, world, india news, entertainment news, national news, telugu news

A 55-year-old man, identified as Ramisetti Lakshmiah, is reported to have hanged himself to death at his residence in Keshavulu Nagar within Vedayapalem limits of Nellore early this morning demanding special status to Andhra Pradesh.

ప్రత్యేకహోదా కోసం మరోవ్యక్తి ఆత్మహత్య.. బాబు తప్పుడు హామీలే కారణం..

Posted: 08/27/2015 07:28 PM IST
Man commits suicide for special status to ap

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మరోకరు అసువులు బాసారు. తిరుపతిలో కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాలో అందరి సమక్షంలో మునికామకోటి అనే వ్యక్తి తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న తరువాత క్రమంగా ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ మరణాలు సంభవిస్తున్నాయి. ఏలూరులో దుర్గా ప్రసాద్ ఆత్మహత్యాయత్నం మరువక ముందే నెల్లూరు జిల్లాలో మరో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రత్యేక హోదా కల్పించాలంటూ రామిశెట్టి లక్ష్మయ్య(55) అనే వ్యక్తి గురువారం తెల్లవారు జామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లా వేదాయపాళెంలోని కేశవోలు నగర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది.

జై అంధ్రా, జై జై అంధ్రా అంటూ నినాదాలతో లక్ష్మయ్య సూసైడ్ నోట్ రాసిపెట్టాడు. అందులో నవ్యాంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని, రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాభివృద్ది జరగాలని, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభించాలని డిమాండ్ చేశారు. ఇదే తన మరణ వాంగ్మూలమని సూసైట్ నోట్ లో రాసిపెట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి లక్ష్మయ్య ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి వద్ద సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లక్ష్మయ్య కుటుంబాన్ని వైఎస్ఆర్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై చంద్రబాబు మోసపూరిత మాటల వల్లే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హాదా కోసం తమకే ఓటు వేయాలని ప్రచారం చేసిన టీడీపీ.. అధికారంలోకి వచ్చిన 15 మాసాలకు ప్రత్యేక హోదా కాదు అంతకన్నా ఎక్కువ ప్యాకేజీ తెస్తామని బూటకపు మాటలను, వల్లెవేస్తోందని అరోపించారు. ఎవరూ ఆత్మబలిదానాలు చేసుకోవద్దని ఆయన కోరారు. అందరం కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాడదామన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nellore  Keshavulu Nagar  Vedayapalem  Ramisetti Lakshmiah  AP special status  kama munikoti  

Other Articles