Hardik Patel the new hero | Gujarat

Hardik patel became the new hero

Hardik Patel, Gujarat, Reservations, Gujarat bandh, Modi, Patel Protest

Hardik Patel became the new hero. In just a matter of two months, a young 22 year old B.Com grad named Hardik Patel became the face of Patel community in Gujarat, which has been protesting for an OBC status in state reservations. The heroic rise of Hardik Patel is baffling even the stalwart politicians, for he managed to galvanise lakhs of Patels, 12% of Gujarat's population, towards raising their stern voice against the state and central governments.

గుజరాత్ హీరోగా మారిన హార్దిక్ పాటిల్

Posted: 08/27/2015 11:23 AM IST
Hardik patel became the new hero

నిన్నటి దాకా కనీసం పేరు కూడా తెలియన ఓ 22 సంవత్సరాల యువకుడి కోసం గూగుల్ లో వెతికేస్తున్నారు. అన్ని మీడియా ఛానల్స్ అతని గురించే వార్తలు ప్రసారం చేస్తున్నాయి.. అన్ని పత్రికలు అతని మీదే వార్తలు రాస్తున్నాయి. మొన్నటిదాకా తెలియని ఓ వ్యక్తి ఎందుకు అంతలా ఫేమస్ అయ్యారు..? గుజరాత్ లో జరుగుతన్న తాజాగా పరిణామాలన్నింటికి కూడా కేంద్ర బిందువుగా మారిన హార్దిక్ పాటిల్ గురించి అధికార పార్టీల్లో భయం పట్టుకుంది. తమ అధికార ప్రాభవానికి ఎక్కడ అడ్డువస్తాడో అని భయపడి చస్తున్నాయి. ఓ సాధారణ కుటుంబం నుండి వచ్చిన ఓ యువకుడు పిలిస్తే గుజరాత్ బంద్ విజయవంతంగా జరిగింది. గుజరాత్ లో ఆ యువకుడి పిలును ఢిల్లీ అధికార పార్టీ ఆఫీసుల్లో మారుమోగింది. హార్దిక్ పటేల్ అనే పేరు ఇప్పుడు ట్రెండ్ సెట్టర్ గా మారింది. తాజాగా గుజరాత్ నుండి పుట్టుకొచ్చిన కొత్త హీరో హార్దిక్ పాటిల్ మీద ప్రత్యేక కథనం..

గుజరాత్ లోని ఓ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన హార్దిక్ పాటిల్ నేడు మొత్తం దేశంలో హీరోగా మారారు. చిన్న వ్యాపారం చేస్తూ బతుకు బండిని లాగిన కుటుంబం నేపథ్యం నుండి వచ్చినా కానీ హార్దిక్ పాటిల్ పిలుపు ఇప్పుడు లక్షల మందిని ప్రేరేపిస్తోంది. పార్టీలకు అతీతంగా పాటిల్ వర్గాన్ని ఏకతాటి మీదకు తెచ్చి వారిని ముందుకు నడుపుతున్నారు హార్దిక్ పాటిల్. గత వారం పది రోజులుగా హార్దిక్ పాటిల్ చేస్తున్న పక్కా ప్రణాళిక అందిరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికే కాదు.. కేంద్ర ప్రభుత్వానికి కూడా ముచ్చమటలు పట్టిస్తున్నారు హార్దిక్. గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన వారందరు తమకు మోసం చేశారని.. ఇక మీదట అలా కుదరదు అని హెచ్చరిస్తున్నారు. అయితే ప్రధాని మోదీకి మాత్రం భయం పట్టుకుంది. తన సొంత రాష్ట్రం నుండే తనకు ముప్పు పొంచి ఉందని మోదీ భయపడుతున్నారు.

మోదీకి, అతని ప్రభుత్వానికి పార్దివ్ పాటిల్ అనే పేరు చెమలు పట్టిస్తోంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనంది బెన్ పాటిల్ ఉన్నా.. తమ సామాజిక వర్గం అయినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదని వారు ఖరాఖండిగా వెల్లడిస్తున్నారు. రిజర్వేషన్లు కల్పించండి లేదంటే.. అందరికి రిజర్వేషన్లు తొలగించండి అంటూ నినదిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తుతానికి హ్యాపీగా ఉన్నారు. గుజరాత్ రాష్ట్రంలో పార్దిక్ పాటిల్ లాంటి వ్యక్తి పై నుండి కింది దాకా అన్ని ప్రభుత్వాలను వణికించడం మీద హ్యాపీగా ఉంది. కానీ హార్దిక్ పాటిల్ తమ పార్టీ కాకుండా బిజెపి లేదంటే ఆప్ లో చేరతారని భయపడుతోంది. ఎందుకంటే అతని తండ్రి ఓ మామూలు బిజెపి కార్యకర్త. ఇక ఆప్ కార్యకర్తగా హార్దిక్ పాటిల్ గతంలో సేవలు అందించారని. కాబట్టి అతను ఆప్ చేరతారని కూడా ప్రచారం నడుస్తోంది. మరి మొత్తానికి ఏం జరుగుతుందో చూడాలి. హార్దిక్ పాటిల్ బన్ గయా నయా హీరో అన్నది మాత్రం వాస్తవం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hardik Patel  Gujarat  Reservations  Gujarat bandh  Modi  Patel Protest  

Other Articles