journalists being shot dead on air | Live | Murder

Journalists being shot dead on air goes viral

Live, Murder, Journalists, America, Varginia

journalists being shot dead on air goes viral. During the live broadcast, shots could be heard, sending the reporter and the person she was interviewing running. Police say they are investigating the incident and still searching for the suspect.

లైవ్ లో మాట్లాడుతుండగా మర్డర్..

Posted: 08/27/2015 10:14 AM IST
Journalists being shot dead on air goes viral

అమెరికాలో దారుణం జరిగింది. లైవ్ రిపోర్ట్ ఇస్తున్న ఇద్దరు టీవీ జర్నలిస్టులను ఓ ఆగంతకుడు కాల్చిచంపాడు. కెమెరా కిందపడిపోవడంతో కాల్పుల దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. వర్జీనియా రాష్ట్రంలోని బెడ్ఫోర్డ్ కౌంటీలో  ఈ సంఘటన జరిగింది. డబ్ల్యూడీబీజే 7 అనే టీవీ ఛానెల్ కు చెందిన మహిళా రిపోర్టర్ ఆలిసన్ పార్కర్, వీడియో జర్నలిస్టు ఆడమ్ వార్డ్లు మౌంటేన్లేక్కు సమీపంలోగల బ్రిడ్జ్వాటర్ ప్లాజాలో మార్నింగ్ షో లైవ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంతలోనే ఆ బిల్డింగ్ లోకి చొరబడ్డ సాయుధుడు.. రిపోర్టర్, కెమెరామెన్లను విచక్షణారహితంగా కాల్చిచంపాడు. సాయుధుడి దృష్టినుంచి తప్పించుకునే క్రమంలో ఆడమ్.. కెమెరాను జారవిడవడంతో ఇద్దరిపైనా కాల్పులు జరిగిన దృశ్యాలు కెమెరాలో రికార్డ్ కావడంతోపాటు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. దుండగుడు ఇంకా ప్లాజా బిల్డింగ్ లోనే దాక్కున్నాడు. దీంతో చుట్టుపక్కల స్కూళ్లు, కాలేజీలు సహా వ్యాపార సముదాయాలు తెరవొద్దని పోలీసులు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం దుండగుడ్ని పట్టుకునేందుకు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Live  Murder  Journalists  America  Varginia  

Other Articles