US court dismisses 1984 riots case against Congress President Sonia Gandhi

Us court dismisses 1984 riots case against sonia gandhi

US court,Sonia Gandhi,New York,Indira Gandhi,Congress, US court dismisses case against Sonia Gandhi, sikh riots case on sonia gandhi, US court dismiss HR violation lawsuit agianst sonia gandhi, 1984 riots, New York, New York Court, Sonia Gandhi, USA

An appeals court here has affirmed a district judge's order to dismiss a human rights violation lawsuit filed against Congress president Sonia Gandhi.

సిక్కుల ఊచకోత కేసులో..అమెరికా కోర్టులో సోనియాగాంధీకి ఊరట..

Posted: 08/26/2015 07:21 PM IST
Us court dismisses 1984 riots case against sonia gandhi

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి అమెరికా కోర్టులో ఊరట లభించింది. 1984 నాటి సిక్కుల ఊచకోతపై 2013లో దాఖలైన పిటిషన్‌ను యూఎస్ కోర్టు కొట్టివేసింది. ఈ ఘటనలో సోనియా గాంధీ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని, ఆమెపై కేసు నమోదు చేయాలంటూ సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ పిటిషన్ వేసింది. దీన్ని విచారించిన అమెరికా జిల్లా స్థాయి కోర్టు.. త్రిసభ్య ధర్మాసనం, ఆరోపణల్లో పరిపక్వత కలిగిన అంశాలు లేవని అభిప్రాయపడింది. ఇందులో కొత్త విషయం ఏమీ లేదని, పాత విషయాలే మళ్లీ చెబుతున్నారంటూ పిటిషన్‌ను కొట్టి వేసింది.

అమెరికా న్యాయస్థానం వెలువరిచిన తీర్పుపై సోనియా గాంధీ న్యాయవాది రవి బాత్రా హర్షం వ్యక్తం చేశారు. దీన్ని చారిత్రక తీర్పుగా ఆయన అభివర్ణించారు. సోనియా గాంధీపై అసత్య ఆరోపణలు చేసిన సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు అమెరికా కోర్టు తీర్పుపై 14 రోజుల్లో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని, అవసరమైతే ఉన్నత న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ న్యాయవాది చెబుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US court  Sonia Gandhi  New York  Indira Gandhi  Congress  

Other Articles