The Radhe Maa-themed kitty party everyone is talking about

Radhe maa hits the headline this time as a party theme

Radhe Maa, Theme kitty party, Social media, Viral, Self-styled godwoman, Twitter, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird, world, india news, entertainment news, national news, telugu news

Nine women will find their faces plastered across social media platforms after their image in Radhe Maa avatars has gone viral.

మిని స్కర్టులో దైవమాత.. అంతర్జాలంలో హల్ చల్ చేస్తున్న రాధేమా తాజా ఫోటో

Posted: 08/26/2015 06:43 PM IST
Radhe maa hits the headline this time as a party theme

పైకి దైవమాతగా ప్రచారం పోందుతూ భక్తుల విశ్వాసాలతో నాటకాలు అడుతూ.. కోట్లాది రూపాయలను పోగేసుకుని.. ఆనక వివాదాల్లో చిక్కుని వివాదాస్పద దైవమాతగా మారన రాధేమా మళ్లీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ పత్రికల ప్రధాన శీర్షకగా మారింది. పైకి దైవాంశ సంహుతురాలిగా పోజులు కోట్టిన రాధేమా అ మధ్య సన్నిలియోన్ లా ఫోజులచ్చి తనలోని మోడ్రన్ బామ అందాలను చూసుకుంటూ మురిసిపోయింది. తాజాగా ఈ వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు కార్యకలాపాలు మరోకటి వెలుగులోకి రావడమే ఇందుకు కారణమైంది

రాధేమాను ఓ పక్క తన అభిమానులు ట్విట్టర్లో ప్రశంసల వర్షం కురిపిస్తే... మరో పక్క ఆమె వివాదాస్పద ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాహ్య ప్రపంచానికి తెలియని గుర్తించని విధంగా అమె ఫోజులతో వ్యాంపు క్యారెక్టర్ కు ఏ మాత్రం తగ్గని రీతిలో వున్నాయి. ఇటీవల ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ ఫోటోను పరిశీలిస్తే.. ఓ కిట్టీ పార్టీలో రాధే మా పొట్టి స్కర్ట్లో కనిపించారు. వార్త ఏజెన్సీ పీటీఐ జర్నలిస్ట్ ఈ ఫొటోను ట్వీట్టర్లో పోస్ట్ చేశారు.  ఫొటోలో రాధేమాతో పాటు ఉన్న మహిళలంతా ఎర్రని వస్త్రధారణతో నుదుటిపై తిలకం, చేతులకు గాజులు కలిగి ఉండటంతో పాటు కొందరు త్రిశూలాన్ని కూడ ధరించి కనిపించారు.  

ఎప్పుడూ  కాషాయ వస్త్రాలు, రుద్రాక్షలు ధరించే ఆమె ఇలా దర్శనమివ్వడం ప్రధాన వార్తగా నిలిచింది. భక్తులకు ప్రవచనాలు చెప్పే రాధేమా.. పోట్టి స్కర్టు ధరించడం.. అమె చుట్టూ వున్న మరో ఎనమిది మంది మాత్రం నిండు వస్త్రాధరణతో ఉండటం చర్చనీయాంశంగా మారింది. రాధేమా విచిత్ర పోకడలు, మోడ్రన్ డ్రెసింగ్ లపై ప్రవచనాలు చేస్తే బాగుంటుందని పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. ఇక నెట్ జనులు తమకు తోచిన విధంగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల రాధే మాపై పలు వివాదాలు రావడం, కేసులు నమోదు కావడం తెలిసిందే. వరకట్నం వేధింపుల కేసులో ముంబై పోలీసులు ఆమెను విచారించారు.  ఆమె మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె అశ్లీలతను ప్రదర్శిస్తున్న దృశ్యాలతో కూడిన ఓ వీడయో సీడిని కూడ పోలీసులకు సమర్పించాడు. తాజాగా ఆమె ఓ ఫొటోలో మిని స్కర్ట్ తో దర్శనమివ్వడం మరోసారి చర్చనీయాంశమైంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radhe Maa  Theme kitty party  Social media Viral  Self-styled godwoman  

Other Articles