girl beating Man | Lucknow | revenge

Girl tracks down her molester and beats him in public

india, beating, Lucknow, revenge, molestation, humiliation

Girl tracks down her molester and beats him in public A young woman tracked down a man who was allegedly harassing her, and taught him a lesson by beating and humiliating him in public before handing him over to the police in the Indian city of Lucknow, Tuesday.

ITEMVIDEOS: నడిరోడ్డులో మగాడిని వాయించిన అమ్మాయి

Posted: 08/26/2015 12:49 PM IST
Girl tracks down her molester and beats him in public

రోజులు మారిపోయాయి... గతంలో ఆడవాళ్లను ఎవరైనా వేధిస్తే ఏడుస్తూ ఇంటికి వెళ్లే వాళ్లు ఆడవాళ్లు. ఇంట్లో ఎవరితోనూ చెప్పలేక నానా బాధలు పడేవాళ్లు. బయటకు వెళ్లాలంటే ఎవరో ఒకరి తోడు లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. అన్ని రంగాల్లో ఆడవాళ్లు దూసుకెళుతున్నారు. తమను వేధించిన వారి భరతం పడుతున్నారు. మొన్న తనను వేధిస్తున్న ఓ స్కూల్ అమ్మాయి.. అబ్బాయిని పోలీస్ స్టేషన్ లోపలే.. పోలీసులు చూస్తుండగానే ఉతికేసింది. అమ్మా తప్పైంది.. ఇంకోసారి ఇలా చెయ్యను అటూ ఏకంగా కాళ్లు మొక్కించుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. తాజాగా ఇలాంటి ఘటనే లక్నోలో చోటుచేసుకుంది.



లక్నోలో ఓ యువతి అపరకాళికగా మారింది. నిద్రలో ఉన్నప్పుడు తనపై అఘాయిత్యానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించిన పక్కింటి వ్యక్తిని అదును చూసి బుద్ధి చెప్పింది. అత్యాచార యత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని నడిబజారుకీడ్చింది. అంతేనా.. చేసిన తప్పు అందరి ముందు ఒప్పుకోవాలంటూ చెంప చెళ్లుమనిపించింది. తప్పయిందని వ్యక్తి చెప్పినా యువతి శాంతించలేదు. ఇంకోసారి తప్పు చేస్తావా అంటూ వీపు విమానం మోత మోగించింది. కాలనీ వాసుల ముందే ధైర్య సాహసాలతో కామాంధున్ని చితక్కొట్టింది. అత్యాచార యత్నం జరిగితే చూస్తూ ఊరుకోవద్దని చాటి చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  beating  Lucknow  revenge  molestation  humiliation  

Other Articles