isis terrorists said that they will take care of telugu professors

Released indian professors recollect isis experience

released indian professors recollect isis experience, telangana, four indians, kidnap, isis, libya, sources, gopi krishna, balaram, kalyani, indian professors, telugu professors,

4 Indians were kidnapped by suspected ISIS terrorists few days back of which two have been released. Many wondered why ISIS, known for their brutality, released two of the kidnapped individuals so tamely. Now an answer has emerged to that mystery.

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తెలుగు ఫ్రోఫెసర్లను బాగా చూసుకుంటామన్నారు.

Posted: 08/04/2015 11:27 PM IST
Released indian professors recollect isis experience

లిబియాలో బందీలుగా ఉన్న తెలుగు ప్రొఫెసర్ల జాడపై వారి కుటుంబసభ్యులలో ఆంధోళన అధికమైంది. గత ఆరు రోజులుగా ఉద్రవాదుల చెరలో వున్న తమ వారిని ఎలాగైనా విడిపించి తీసుకురావాలని వారి కుటుంభ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా. తెలుగు ప్రొఫెసర్ల గురించి ఆందోళన చెందవద్దని, వారిని బాగా చూసుకుంటామని ఐఎస్ ఉగ్రవాదులు హామీ ఇచ్చినట్లు అక్కడి నుంచి భారత్ తిరిగివచ్చిన కర్ణాటక ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రామకృష్ణ తెలిపారు. తెలుగు ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణలతో పాటు అపహరణకు గురై విడుదలైన రామకృష్ణ బెంగళూరులో మీడియాతో మాట్లాడారు.

తనను విడిచిపెట్టే సమయంలో కిడ్నాపర్ల నాయకుడు మాట్లాడుతూ బందీలుగా ఉన్న తెలుగువారిని బాగా చూసుకుంటామని హామీ ఇచ్చాడన్నారు. వారి క్షేమ సమాచారాల గురించి తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక నెంబర్ కూడా ఇచ్చారని రామకృష్ణ చెప్పారు. ఈ నెంబర్ ద్వారా తాను ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. రామకృష్ణతో పాటు ఆయన సహచరుడు విజయ్ కుమార్‌ని కూడా ఐఎస్ ఉగ్రవాదులు విడిచిపెట్టారు. వీరంతా లిబియాలోని సిర్టే యూనివర్శిటీలో సేవలందిస్తూ వచ్చారు. మరోవైపు తెలుగు ప్రొఫెసర్ల విడుదల కోసం భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  four indians  kidnap  isis  libya  gopi krishna  balaram  

Other Articles