Riju Bafta | Posts | Baby girl | India

Riju bafta ias contraversial posts sensation in india

IAS, Bafta, Riju Bafta, Posts, Baby girl, India, Facebook

A IAS contraversial posts sensation in india. IAS Officer Bafna says in the post that she had lodged an FIR against Santosh Chaubey, the Ayogmitra of Human Rights Commission. Chaubey had been sending her 'indecent' messages for a while.

మహిళా ఐఏఎస్ పోస్ట్ సంచలనం.. భారత్ లో అమ్మాయి పరిస్థితి అదా..?

Posted: 08/04/2015 03:55 PM IST
Riju bafta ias contraversial posts sensation in india

ఓ యువ ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్ సంచలనమైంది. ఆమె పోస్ట్‌పై పెద్ద డిబేటే నడుస్తోంది సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్స్‌. రిజు బఫ్నా.. మహిళా ఐఏఎస్ ఆఫీసర్. తనను ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడని కేసు పెట్టింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టులో జరిగిన సంఘటనలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ, ఆమె సోషల్ నెట్‌వర్క్‌ సైట్స్‌లో ఏం పోస్ట్‌ చేసిందంటే.. ముందుగా ఆమె ఈ దేశంలో ఆడవాళ్లు పుట్టకూడదని మొదట పోస్ట్ చేసింది.తర్వాత ఎడిట్ చేసి మరో పోస్ట్ చేసింది. దాంట్లో, భారత్‌లో పుట్టే ఆడవాళ్లు వేధింపులకు ఎదుర్కోవడానికి ముందే ప్రిపేర్ కావాలంది. ఈ కంట్రీని బ్లేమ్ చేసినందుకు క్షమాపణలు కోరింది.

riju-bafta-comments

కోర్టులో తన వాదనను వినిపించడానికి ప్రైవసీ కోరితే న్యాయవాది, జడ్జి అనుచిత వ్యాఖ్యలు చేశారంది. మీరు బయట ఆఫీసర్ గానీ, కోర్టులో కాదని లాయర్ సెటైర్లు వేశారని ఆరోపించారు. చివరికి అర్థం చేసుకోవాల్సిన జడ్జి కూడా అలాగే ప్రవర్తించారన్నారు. చివరికి, సుదీర్ఘ పోరాటం తర్వాత అతన్ని ఆ పదవి నుంచి తప్పించారు తప్ప, తగిన శిక్ష పడలేదన్నారు. మహిళల పట్ల సెన్సిటివ్గా వ్యవహరించాల్సిన హక్కుల సంఘాల్లోని సభ్యుల ప్రవర్తన తీరుపైనా ఆమె మండిపడ్డారు. కేసు విచారణ సమయంలో మహిళలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సిన కోర్టులు, న్యాయవాదుల తీరుపై పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. రిజు కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నాయ్‌. రిజు మధ్యప్రదేశ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారిణి. మొత్తానికి ఈ వ్యవహారంపైనా మధ్యప్రదేశ్‌ సర్కార్‌కు తలనొప్పలు తప్పేట్లు లేవు. అసలే వర్షాకాల సమావేశాలు అయ్యేలోపు ఎవరికి ఎర్త్‌ పడుతుందో అని టెన్షన్ పడుతుంటే.. రిజు కామెంట్స్.. కొత్త తలనొప్పలు తెచ్చేట్లు కనిపిస్తున్నాయ్..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IAS  Bafta  Riju Bafta  Posts  Baby girl  India  Facebook  

Other Articles