Talasani | Bonalui | DCP | Police

Clash betweet telangana minister talasani srinivas and dcp

Talasani, Bonalui, DCP, Police, DJ, Talasani Srinivas

Clash betweet Telangana minister Talasani Srinivas and DCP. On Boanalu occasion Talasani fired on police who tried to stop the Cj rally of his follwers.

ITEMVIDEOS: నాతో పెట్టుకోకు.. తలసాని కమిషనర్ కు మధ్య వాగ్వాదం

Posted: 08/04/2015 03:17 PM IST
Clash betweet telangana minister talasani srinivas and dcp

ఆయన మాములు పోలీస్ కాదు. ఈయనేమో మాములు పొలిటీషియన్ కాదు. కానీ ఇద్దరి మధ్య నువ్వానేనా తేల్చుకుందాం అన్నట్లు మాటల యుద్ధం సాగింది. ఇంతకీ ఎవరు గెలిచారు.. ఎవరు తగ్గారు అన్నది పక్కన పెడితే పోలీస్ వర్సెస్ మంత్రి టాపిక్ ఇప్పుడు తెలంగాణలో రాజకీయ హీట్ ని లేపుతోంది. నార్త్ జోన్ డీసీపీ ప్రతాప్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్. బోనాల పండగ సందర్భంగా మంత్రి ఇంటి దగ్గర అభిమానులు డీజే సౌండ్ ఏర్పాటు చేశారు. అయితే లష్కర్ బోనాల్లో డీజే సౌండ్ కు అనుమతి లేదని ఇంతకుముందే డీసీపీ ప్రతాప్ రెడ్డి ఆదేశించారు. అయితే ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మంత్రి అభిమానులు పెద్దగా మ్యూజిక్ సౌండ్ తో పండగ చేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న డీసీపీ తన సిబ్బందితో కలిసి మంత్రి ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన డీజే సౌండ్ ని ఆపేయాలని ఆదేశించారు. ఈలోగా మంత్రి తలసాని అక్కడకు చేరుకొని పోలీస్ బాస్ తో వాగ్వాదానికి దిగారు. డీజే సౌండ్ ని ఆపేది లేదని ఏం చేసుకుంటావో చేసుకో, నేను ఎంతదాకా వెళ్లాల్లో వెళ్తానంటూ డీసీపీ ప్రతాప్ ని హెచ్చరించి తలసాని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

తలసాని: ఏం చేస్తావ్..?
తలసాని:ఏం చేసుకుంటావో చేసుకో..
డిసిపి:వార్నింగ్ ఏంటిదిది.
తలసాని:నేను ఎంత వరకు వెళ్లాల్నో వెళ్తా
తలసాని: ఏమైతదో చూస్తానడు
డిసిపి : సార్.. పర్మిషన్ లేదు
తలసాని: సీజ్ చేస్తారా.. ? చూద్దాం
తలసాని: చూపిస్తా ఏందీ...?
తలసాని: మాక్కూడా తెలుసు. ఏం చెయ్యాల్నో..
తలసాని: వెయ్య్ వెయ్ సీడీ వెయ్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Talasani  Bonalui  DCP  Police  DJ  Talasani Srinivas  

Other Articles