we support mro vanajakshi says nandamuri harikrishna

Nandamuri harikrishna comes in rescue of mro vanajakshi

nandamuri harikrishna comes in rescue of MRO Vanajakshi, TDP polit bureau member nandamuri harikrishna, nandamuri harikrishna, harikrishna, Vanajakshi, Musunuru MRO Vanajakshi warning letter, Vanajakshi warning letter, Warning letter to MRO Vanajakshi, Mandal magistrate, Mandal revenue officer, Musunuru, TDP, Warning letter

TDP polit bureau member nandamuri harikrishna comes in rescue of Musunuru MRO Vanajakshi, whi=o received a warning letter from an unknown person

వనజాక్షికి అండగా నిలిచిన సీతయ్య..!

Posted: 08/04/2015 01:53 PM IST
Nandamuri harikrishna comes in rescue of mro vanajakshi

ముసునూరు ఎమ్మార్వో వనజాక్షికి చంపేస్తామంటూ.. ఆగంతకుల నుంచి బెదిరింపు లేఖ అందిన నేపథ్యంలో సినీనటుడు, నందమూరి హరికృష్ణ అమెకు మద్దతుగా నిలిచారు. తన విధులను తాను సక్రమంగా నిర్వహిస్తున్న ఎమ్మార్వో వనజాక్షిని పది రోజులలోపు బదిలీ చేసుకుని వెళ్లిపోవాలని డిమాండ్ చేయడంతో పాటు.. అలా చేయిన పక్షంలో హతమారుస్తామంటూ ఆగంతకులు లేఖ రాయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వనజాక్షి పోరాటానికి అండగా తాను ఉంటానని, అమెను చంపుతామని బెదిరింపు లేఖ రాసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని హరికృష్ణ డిమాండ్ చేశారు.

అలాగే నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులోనూ.. అమె మరణానికి కారణమైన వారిపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టకూడదని ఆయన కోరారు. సీనియర్ల ర్యాగింగ్ ఉదంతం నేపథ్యంలో రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న ఘటన తనను కలిచివేషిందన్నారు. అధికారులకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదని, ఇలాంటి చర్యలతో పార్టీకి, ప్రభుత్వానికి చెడు పేరు తీసుకురావడం కూడా మంచిది కాదని హరికృష్ణ అభిప్రాయపడ్డారు.

కాగా, తాను ముసునూరు వదిలి వెళ్లే ప్రసక్తే లేదని ఎమ్మారో వనజాక్షి స్పష్టం చేశారు. బెదిరింపులకు తాను లోంగనని, ఉద్యోగుల ప్రానాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని అమె అన్నారు. అలాగే తన కుటుంబానికి హాని ఉన్నందన ప్రభుత్వమే తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్న తమను ఆగంతకులు బెదిరింపులకు గురిచేస్తున్న క్రమంలో ప్రభుత్వ అధికారులు ఎలా విధులు నిర్వహిస్తారని అమె ప్రశ్నించారు. భయాంధోళతన మధ్య దినదిన గండంగా ఉద్యోగాలను నిర్వహించాలా..? అని ప్రశ్నించారు. ఈ తరహా బెదిరింపులకు తాను జడవనని వనజాక్షి తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vanajakshi  Mandal revenue officer  Musunuru  TDP  Nandamuri Harikrishna  

Other Articles