Government Mulls Ombudsman To Monitor Romantic Sites On Internet | Roamnce Ban

Government mulls ombudsman to monitor romantic sites on internet

romance sites, social media, hot websites, romance websites, modi sarkar, central govt, ravishankar prasad

Government Mulls Ombudsman To Monitor Romantic Sites On Internet : Central Telecommunication minister ravishankar prasad said that they did not ban on romance sites.

అబ్బే.. ఆ సైట్లను బ్యాన్ చేయలేదు! కానీ..?

Posted: 08/04/2015 12:50 PM IST
Government mulls ombudsman to monitor romantic sites on internet

దేశంలో అశ్లీల వైబ్ సైట్లు నిషేధం అవ్వడమే ఆలస్యం.. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా అన్నివర్గాలనుంచి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఆ విషయంపైనే తీవ్రస్థాయిలో చర్చ కొనసాగుతోంది. మీడియాలో కూడా ఈ అంశంపై వార్తలమీద వార్తలొస్తున్నాయి. మొత్తం 857 అశ్లీల వెబ్ సైట్లను బ్యాన్ చేయడంపై ఊహించని విధంగా వ్యతిరేకత వెలువడింది. దీంతో మోదీ సర్కారు నష్టనివారణకు చర్యకు దిగిరాక తప్పలేదు. ఈ పోర్న్ వెబ్‌సైట్లకు అడ్డుకట్టవేస్తే అది వైద్య, విజ్ఞాన రంగాలకు సంబంధించిన కీలక సమాచారం గల్లంతుకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు, ఐటీ నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో.. ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాలనుకుంటోంది.

ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర టెలికాం, ఐటీ శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్.. ఇంటర్నెట్ లో పోర్న్ ను పూర్తిగా నిషేధించడం తమ ఉద్దేశం కాదని, వాటిని పర్యవేక్షిస్తూ వుండాలన్నదే తమ అభిమతమని ఆయన వ్యాఖ్యానించారు. దీనికోసం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అంబుడ్స్మన్ వ్యవస్థను త్వరలో ఏర్పాటుచేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘ప్రజలపై మోరల్ పోలిసింగ్ చేసే ఉద్దేశం మాకు లేదు, విపరీత పరిణామాలు తలెత్తకముందే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం’ అని ప్రసాద్ వివరించారు. ఆయన ఈ విధంగా మాట్లాడటంపై కూడా ప్రభుత్వ దిద్దుబాటు చర్యల్లో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతకీ ఈ సైట్లను బ్యాన్ చేయడంపై వ్యతిరేకత ఎందుకు వ్యక్తమవుతోందంటే.. వీటికి అనుబంధంగా వుండే కొన్ని కీలకమైన సమాచారం నెటిజన్లకు అడ్డు పడుతుంది కాబట్టి!

వెబ్ ఫిల్టర్లు కేవలం ‘కీ పదాల’ ఆధారంగా పని చేస్తాయిగనుక ఎయిడ్స్‌కు సంబంధించిన సమాచారం గల్లంతుకావచ్చు. సెక్స్ సమస్యలకు సంబంధించిన వైద్య విజ్ఞానానికి సంబంధించిన సమాచారమూ నెటిజన్లకు చేరకుండా అడ్డుపడుతుంది. ‘సెక్స్’ అనే కీ పదాన్ని వెబ్ ఫిల్టర్లు అడ్డుకున్నా.. వినియోగదారులకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉండకపోవు. అంతేకాదు.. మరెన్నో వెబ్ ఫిల్టర్లకు దొరకని పదాల ద్వారా ఇలాంటి వెబ్ సైట్లకు వెళ్లే అవకాశాలు వుండటంతో.. పోర్న్ సైట్లపై బ్యాన్ బదులు నిఘా పెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఇదిలావుండగా.. పోర్న్ వెబ్‌సైట్లను చూసే దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉందని 2013-2014 జరిపిన సర్వేలో తేలిందని అలెగ్జా తెలియజేసింది. ఈ సైట్లను చూసే ప్రపంచ ప్రజల సరాసరి సగటు 7.6 శాతం ఉండగా, భారత్ ప్రజల సగటు 7.32 శాతం వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : romance sites  modi sarkar  ravishankar prasad  

Other Articles