land bill | modi | NDA | Parlaiment

In huge defeat government will remove all changes to land bill

land bill, modi, NDA, Parlaiment, AMendements, Land pooling, Narendra Modi

In Huge Defeat, Government Will Remove All Changes to Land Bill. In a huge setback for Prime Minister Narendra Modi's economic agenda, his government will reportedly withdraw virtually every change it had made to the existing law on acquiring farm land for industry.

ITEMVIDEOS: భూసేకరణ చట్టం మీద వెనక్కి తగ్గిన మోదీ..!

Posted: 08/04/2015 12:47 PM IST
In huge defeat government will remove all changes to land bill

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం భూసేకరణ సవరణ బిల్లు విషయంలో దిగరాక తప్పలేదు. 2013లో యూపీఏ ప్రభుత్వం చేసిన భూసేకరణ చట్టానికి తమ ప్రభుత్వం ప్రతిపాదించిన అన్ని సవరణలనూ ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. భూమిపై రైతులకు హక్కులేకుండా చేస్తోందని భావిస్తున్న ఈ సవరణలను కాంగ్రెస్, వామపక్షాలు సహా అన్ని ప్రతిపక్ష పార్టీలూ వ్యతిరేకించటం తెలిసిందే. భూసేకరణ సవరణ బిల్లు ఇప్పటికి పలుమార్లు లోకసభ ఆమోదం పొందినా, రాజ్యసభ ఆమోదం తీసుకోవటంలో విఫలమవటంతో, ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తూ వచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం చివరకు భూసేకరణ సవరణ బిల్లుపై పార్లమెంటు సెలెక్ట్ కమిటీని వేసింది.ఈ కమిటీ ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపాదించిన అన్ని సవరణలనూ ఉపసంహరించుకోవాలనే సిఫారసు చేస్తున్నట్టు సమాచారం.

సెలెక్ట్ కమిటీ సిఫార్సులను దృష్టిలో పెట్టుకుని 2013 భూసేకరణ చట్టానికి తాము ప్రతిపాదించిన అన్ని సవరణలను ఉపసంహరించుకోవాలని ఎన్డీయే ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. 2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఇస్తారని అంటున్నారు. వ్యాపారానికి అనుకూలంగా ఉండే భూసంస్కరణలను చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేయాలని ఎన్డీయే ప్రభుత్వం ఇదివరకే ప్రతిపాదించటం తెలిసిందే. దేశంలో వౌలిక సదుపాయాలను త్వరితగతిన పెంచటంతోపాటు పెద్దఎత్తున పారిశ్రామిక ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు భూసేకరణ చట్టానికి మోదీ ప్రభుత్వం పలు సవరణలు ప్రతిపాదించటం తెలిసిందే. ఇప్పుడు వీటిని ఉపసంహరించుకోవాలనే నిర్ణయానికి రావటంతో 2013 భూసేకరణ చట్టం యథాతథంగా ఉండే అవకాశం ఉంది.

సంయుక్త పార్లమెంట్ కమిటీలోని 11మంది బిజెపి సభ్యులు సామాజిక ప్రభావ మదింపు అంశాన్ని, అలాగే భూములు తీసుకోవడానికి ముందు ఆయా రైతుల అంగీకారం తీసుకోవాలన్న నిబంధనను పునరుద్ధరించాలని నిర్ణయించారు. తాజాగా తుది నివేదిక ఇవ్వడానికి మరో నాలుగు రోజులపాటు తమకు గడువు కావాలని అహ్లూవాలియా సారథ్యంలోని ఈ పార్లమెంటరీ ప్యానెల్ కోరిన నేపథ్యంలో ఈనెల 7వ తేదీనాటికి భూసేకరణ బిల్లుపై ఏకాభిప్రాయ సిఫార్సులను పార్లమెంట్‌కు సమర్పించే అవకాశం కనిపిస్తోంది. ‘2003లో మేమెలాంటి చట్టాన్ని తీసుకొచ్చామో ఈ సవరణల ఉపసంహరణల వల్ల అలాంటి చట్టమే అమల్లోకి వస్తుంది. ఇది చాలా మంచి పరిణామం’ అని కమిటీలోని కాంగ్రెస్ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. అధికార బిజెపి ప్రవేశపెట్టిన ఈ తాజా సవరణలతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని వెల్లడించారు. అయితే ఈ సవరణలను నేటి ఉదయమే సభ్యులకు పంపిణీ చేశారని, వాటిని అధ్యయనం చేసే సమయమే తమకు లేకుండా పోయిందంటూ తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు డెరక్ ఓబ్రియాన్, కళ్యాణ్ బెనర్జీలు సమవేశం నుంచి వాకౌట్ చేశారు. మొత్తం ఆరు సవరణలపై నేటి కమిటీలో చర్చ జరిగింది. అన్నింటిపైనా సభ్యులమధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మొత్తం 15 సవరణల్లో తొమ్మిది అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని కలిగి ఉండటం వల్ల కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలూ వాటిని వ్యతిరేకించాయి. ఈ తొమ్మిందిటిలో ఆరు సవరణలపై నేటి సమావేశంలో చర్చ జరిగిందని, వాటిపై ఏకాభిప్రాయం కుదిరిందని కాంగ్రెస్ సభ్యులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : land bill  modi  NDA  Parlaiment  AMendements  Land pooling  Narendra Modi  

Other Articles