parliament | Loksabha | speaker

Lok sabha speaker suspends 25 congress mps

parliament, Loksabha, lok sabha speaker, Sumithra Mahajan, BJP, Congress, Vasundhara Raje, Sushma swaraj

Lok Sabha Speaker suspends 25 Congress MPs Hours after she named and suspended 25 Congress Lok Sabha members for five days for “persistently and wilfully obstructing” proceedings in the House, Speaker Sumitra Mahajan on Monday said she had taken a “decision for the future good of Parliament”. She underlined that the “opposition must have its say, but the government also must have a way”.

ITEMVIDEOS: పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్.. మండిపడుతున్న ప్రతిపక్ష పార్టీలు

Posted: 08/04/2015 12:43 PM IST
Lok sabha speaker suspends 25 congress mps

విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రుల రాజీనామాలకు పట్టుబడుతూ పార్లమెంట్ ను స్తంభింపజేస్తున్న 25 మంది సభ్యులను ఐదు రోజుల పాటు సభ నుండి సస్పెండ్‌ చేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించడం తీవ్ర సంచలనం సృష్టించింది. పార్లమెంట్‌లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు చొరవ తీసుకోవడానికి బదులుగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంచుకొన్న ఈ అసాధారణ వ్యూహంపై ప్రతిపక్షం భగ్గుమంది. సస్పెన్షన్‌కు గురైన కాంగ్రెస్‌ సభ్యులకు సంఘీభావంగా, పార్లమెంట్‌లో ప్రతిపక్షం గొంతు నులిమే ప్రయత్నాలను నిరసిస్తూ రేపటి నుండి మిగిలిన వారం రోజుల వర్షాకాల సమావేశాలను పూర్తిగా బహిష్కరించాలని సుమారు పది ప్రతిపక్ష రాజకీయ పార్టీలు నిర్ణయించాయి.

దేశంలోని అత్యున్నత చట్టసభలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి, సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రతిపక్ష సభ్యులను సభ నుండి గెంటివేయడం ప్రజాస్వామ్యానికి దుర్దినమని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా ఖండిం చారు. ఎన్డీఏ ప్రభుత్వ ఏకపక్ష, నిరంకుశ వ్యవహారశైలికి వ్యతిరేకంగా ఇతర అన్ని ప్రతిపక్ష పార్టీలను కూడగట్టి పార్లమెంట్‌ లోపల, వెలుపల ఐక్య పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని పార్లమెంట్‌ ఉభయ సభల్లో కాంగ్రెస్‌ పక్ష నాయకులు గులాంనబీ ఆజాద్‌, మల్లికార్జున్‌ ఖర్గే ప్రకటించారు.

ప్రతిపక్షం గొంతు నులిమి, అణచివేయడం ద్వారా శాసనసభను ఏకపక్షంగా నడిపే గుజరాత్‌ తరహా ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోడీ పార్లమెంట్‌లో కూడా అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించిన ఖర్గేతో తృణమూల్‌ కాంగ్రెస్‌, సిీపీఐ, సిీపీఎం, ఆర్‌ఎస్‌పీ, ముస్లింలీగ్‌, ఆమ్‌ఆద్మీ పార్టీ, జనతాదళ్‌ (యు), ఎన్‌సీపీ, రాష్ట్రీయ జనతా దళ్‌ తదితర పార్టీలు ఏకీభవించాయి. మంగళవారం నుండి పార్లమెంట్‌ సమావేశాలను వారం రోజుల పాటు బహిష్కరించ నున్నట్లు ప్రకటించాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parliament  Loksabha  lok sabha speaker  Sumithra Mahajan  BJP  Congress  Vasundhara Raje  Sushma swaraj  

Other Articles