annual festival of Secunderabad Mahankali lashker bonalu celebrated grandly

Gaiety marks secunderabad bonalu festival

Gaiety marks Secunderabad Bonalu festival, Gaiety, Secunderabad Mahankali, lashkar Bonalu festival, annual festival of Secunderabad Mahankali lashker bonalu celebrated grandly, CM KCR, talasani srinivas yadav, paatu vasthralu, Mahankali Jatra, rangam, Lashkar Bonalu, Venkaiah naidu, bandaru dattareya, kishan reddy, chandrababu

Pomp and gaiety here on Sunday marked Mahankali Jatra, the annual festival of Secunderabad, popularly known as Lashkar Bonalu, CM kcr presnted paatu vasthralu to deity.

ఘనంగా సికింద్రాబాబ్ మహంకాళీ అమ్మవారి బోనాలు..

Posted: 08/02/2015 09:16 PM IST
Gaiety marks secunderabad bonalu festival

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా కొనసాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దీనికి ముందు తెల్లవారుజామున తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి తదితరులు ఆయన వెంట వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, ఈటెల రాజేందర్, ఇంద్ర కరణ్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు బోనం మొక్కులు తీర్చుకునేందుకు తెల్లవారుజామునుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం ఆలయంలో భారీగా క్యూ కట్టారు. భక్తుల రద్ధీ దృష్ట్యా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆలయ అధికారులతో పాటు ప్రభుత్వం, పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. అమ్మవారి బోనాలు రేపు నిర్వహించనున్న రంగం వేడుకతో ముగియనున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gaiety  Secunderabad Mahankali  lashkar Bonalu festival  

Other Articles