Telangana government to enter into 24 hours power scheme agreement soon

Centre agrees for 24 hours power scheme to telangana

centre agrees for 24 hours power scheme to telangana, piyush goyal, KCR, telangana, 24 hour power scheme, central government, union government, union minister piyush goyal, Telangana government, 24 hours power scheme, agreement, union ministry, green signal

Telangana government to enter into 24 hours power scheme agreement soon, as union ministry gives green signal for the same after small changes.

తెలంగాణకు నిరంతర విద్యుత్, త్వరలోనే పథకం ఒప్పందం

Posted: 08/02/2015 08:18 PM IST
Centre agrees for 24 hours power scheme to telangana

తెలంగాణ రాష్ట్రంలోనూ 24 గంటల విద్యుత్‌ సరఫరాను అందించేందుకు కేంద్రం పచ్చజెండాను ఊపింది. 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే ఏపీకి 24 గంటల విద్యుత్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. విద్యుత్‌ సరఫరా వ్యవస్థను ఆధునీకరించేందుకు ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉండటంతో.. ఏపీలాగే తమకూ నిరంతరాయ విద్యుత్‌ను ఇవ్వాలని తెలంగాణ సర్కార్‌ చాలాసార్లు కేంద్రాన్ని కోరింది. దీనిపై చాలా సమావేశాల్లో చర్చలు జరిగాయి.

తాజాగా, గత వారాంతంలో ఢిల్లీలో కేంద్ర విద్యుత్‌ శాఖలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. దీంతో స్వల్ప సవరణలతో ఈ ప్రతిపాదనకు కేంద్ర విద్యుత్‌ శాఖ దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతిపాదనలకు సూత్రపాయ ఆమోదం తర్వాత.. కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ఈ పథకం అమలు అవగాహన పత్రంపై సంతకాలు జరిగే అవకాశముందని ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : piyush goyal  KCR  telangana  24 hour power scheme  

Other Articles