Tiger Memon wanted to bomb plane at Sahar Airport to avenge Mumbai riots, says 1993 bomb blasts accused

Tiger memon wanted to bomb plane at sahar airport

Tiger Memon, Sahar Airport attack plan, bomb blasts accused, Nasir Abdul Kadar Kewal, Mumbai riots, CBI, ISI, avenge Mumbai riots, smuggler-turned-terror mastermind Tiger memon, y akub memon

Nasir Abdul Kadar Kewal said that smuggler-turned-terror mastermind Tiger had formed a special team to carry out the attack at Sahar Airport and he was also one of the team members. According to the plan, the team was supposed to wait in a car on the runway and was commissioned to bomb the aircraft as soon as it approached them.

విమానాన్ని పేల్చివేసేందుకు కుట్ర పన్నిన ఉగ్రవాదులు

Posted: 08/02/2015 08:17 PM IST
Tiger memon wanted to bomb plane at sahar airport

ముంబైలో 1993 పేలుళ్ల ప్రధాన నిందితుల్లో ఒకడైన టైగర్‌ మెమన్‌... ఆ తరువాత మరో భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్లు తెలిసింది. ముంబై ఘర్షణలకు ప్రతీకారంగా ఏకంగా సహర్‌ ఎయిర్‌పోర్టులో విమానాన్ని పేల్చివేయాలని నిర్ణయించడన్న విషయం తెలిసింది.. తద్వారా దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో భారీ భయాందోళనలు సృష్టించాలని కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. 1993 వరుస పేలుళ్ల కేసులోని నిందితుడైన నాసిర్‌ అబ్దుల్‌ కాదర్‌ కెవాల్‌ ను విచారించిన పోలీసులకు ఆయన ఈ భయానక విషయానలు తెలిపాడు.

ఇందుకోసం ఏకంగా ఒక ప్రత్యేక బృందాన్ని కూడా టైగర్ మెమెన్ ఏర్పాటు చేసినట్లు నాసిర్‌ తెలిపాడు. అందులో టైగర్‌ కూడా సభ్యుడిగా ఉన్నాడని వివరించాడు. విమానాశ్రయంలో రన్‌వేకు దూరంగా ఒక కారులో ఉండాలని, విమానం దగ్గరగా వచ్చినప్పుడు అదును చూసుకుని పేల్చివేయాలన్నది అతడి ప్రణాళిక. ఈ ఘటనలో భారీనష్టం జరక్కపోయినా... కనీసం దాని రెక్క వరకూ దెబ్బతిన్నా... భయాందోళనలు సృష్టించాలన్న అతడి కోరిక నెరవేరుతుందని భావించాడు. కానీ, ఈ ప్రణాళికను అమలు చేయకుండా తర్వాత వెనక్కు తగ్గారు.

ఈ కుట్రకు సంబంధించిన వివరాలను మెయిల్‌ టుడే పత్రిక ప్రత్యేకంగా సేకరించింది. దీంతోపాటు, 1994లో టైగర్‌ మెమన్‌ కరాచీలో ఉన్నట్లుగా తెలియచేసే ఆధారాలను కూడా ఈ పత్రిక సంపాదించింది. అక్కడి యాకూబ్‌ మెమన్‌ ఇంట్లో సహచరులతో టైగర్‌ సంభాషణలకు సంబంధించిన ఆధారాలనూ ఈ పత్రిక సేకరించింది. ఆ సందర్భం గా ఐఎ్‌సఐను ఇంటర్నేషనల్‌ స్పోర్ట్స్‌ ఏజెన్సీగా టైగర్‌ ప్రస్తావించా డు. ఈ సంభాషణలను సీబీఐకి యాకూబ్‌ మెమన్‌ తెలియచేసి తా ను అమాయకుడినని పేర్కొన్నట్లు కూడా మెయిల్‌ టుడే పేర్కొంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tiger Memon  Sahar Airport attack plan  Nasir Abdul Kadar Kewal  

Other Articles