Woman Engineer Enacts Rape Drama to Protest Against Parents

Erode women enacis rape drama to avoid marriage

erode women Enacis rape drama to avoid marriage, Tamilnadu techie, Erode engineer, Woman Engineer Enacts Rape Drama, engineer working in Tiruchendogu, techie expressed regrets for creating unnecessary problem to police, COIMBATORE, Woman, Engineer, Enacts, Rape, Drama, Protest, Against, Parents, fake rape, gang rape, violence against women, crime against women, harrassment against women

A woman engineer retracted from her statement of being raped and confessed that she enacted a drama, since her parents opposed her love affair.

ప్రమేను గెలిపించేందుకు.. ఇలా చేసి అడ్డంగా దోరికిన ఇంజనీర్

Posted: 08/01/2015 10:07 PM IST
Erode women enacis rape drama to avoid marriage

ప్రేమ కోసమై వలలో పడేనే పాపం పసివాడు.. అన్న పాతాళభైరవి పాట విన్నప్పుడల్లా.. అయ్యో అని అంటాం.. ఇక ఇలాంటి ధీమ్ తో వచ్చిన ప్రేమ కథా చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే సినిమాలే హిట్ అవుతున్నాయ్..కానీ ప్రేమికులు మాత్రం నిజ జీవితంతో చాలా వరకు విఫలమవుతున్నారు. ఇదే ఆ 24 ఏళ్ల ఇంజనీర్ విషయంలోనూ జరిగింది. అంతే అమె ముందు వెనుక ఆలోచించకుండా.. తాను ఆడబోతున్న నాటకం పర్యవసానాలు ఎలా వుంటాయన్న విషయం కూడా తెలియకుండా.. తన ప్రేమను గెలిపించుకోవాలనుకుంది. అంతే రంగంలోకి దిగింది.

వివరాల్లోకి వెళ్తే..  అమెకు 24 ఏళ్లు. ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని గత కొన్నేళ్లుగా ఉద్యోగం చేస్తుంది. అయితే ఉద్యోగం కోయంబత్తూర్ లో కావడంతో అక్కడే హాస్టల్ లో వుంటూ ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో అమెకు సహా ఉద్యోగితో పరిచయం ఏర్పడి అది కాస్తా.. ప్రేమగా వికసించింది. అయితే ప్రేమించిన వ్యక్తిని పరిణయం అడతానని అమె తల్లిదండ్రులకు చెప్పింది. సహజంగానే అందరి తల్లిదండ్రులు చెప్పినట్లుగానే అమె తల్లిదండ్రులు కూడా వద్దని, కూడదని, నచ్చజెప్పారు. వినకపోతే చస్తామని బెదిరించారు. సరే అంటూ తల ఊపి మళ్లీ ఉద్యోగం కోసం ఈరోడ్ నుంచి కోయంబత్తూర్ కు అమె చేరుకుంది.

ఈ లోగా అమెకు వివాహం చేయాలని అమె తల్లిదండ్రులు సద్గులాలు కలిగిన అల్లుడి కోసం అన్వేషణ ప్రారంభించారు. అయితే అమెకు విషయం తెలిసింది. పెళ్లి వ్యవహారాలను ఎలాగైనా అపాలని నిశ్చయించుకున్న యువతి అత్యాచార నాటకానికి తెర లేపింది. గత నెల 28న హాస్టల్ లో వుండగా కాళ్లు చేతులు కట్ట్ేసి వున్న యువతిని చేసిన హాస్టల్ సిబ్బంది ఏం జరిగిందని ఆరా తీయగా, తనపై ఇద్దరు అగంతకులు అత్యాచారం చేశారని తెలిపింది. దాంతో వారు శరవణం పట్టి పోలీసులకు పిర్యాదు చేశారు.

విషయం తెలసుకున్న తల్లిదండ్రులు హాస్టల్ కు చేరుకుని వారి బిడ్డను ఈరోడ్ లోని తమ నివాసానికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసలుకు వైద్య నివేదికలో అమె అత్యాచారానికి గురికాలేదని తెలియడంతో షాక్ గురయ్యారు. దీంతో యువతితో పాటు అమె తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించి విచారించారు. యువతి సొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు తమ స్టైల్ లో గట్టిగా విచారించగా, ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు, తల్లిదండ్రులు చేస్తున్న వివాహ ప్రయత్నాలను విరమింపజేసేందుకు ఇలా నాటకం అడానని చెప్పింది. దీంతో ఒకింత కోపం, ఒకింత సంతోషం వ్యక్తం చేసిన పోలీసులు..  మరోసారి ఇలా చేస్తు అర్టెస్టు చేస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలిపట్టారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : erode engineer  marriage  enacts rape drama  

Other Articles