shiridi sai, raghavendra swamy, dattatreya temples celebrate guru poornima

Devotees throng temples on guru poornima

shiridi sai, raghavendra swamy, dattatreya temples celebrate guru poornima, devotees throng temples on guru poornima, shiridi sai dwarakamai, raghavendra swamy m matam, dattatreya temple, ganugapur, special prayers, auspicious day, guru poornima, devotees, puttaparthy

shiridi sai, raghavendra swamy, dattatreya temples celebrate guru poornima, as devotees throng temples to perform special prayers on this auspicious day

కన్నుల పండువగా సాగిన గురుపౌర్ణమి వేడుకలు

Posted: 07/31/2015 06:03 PM IST
Devotees throng temples on guru poornima

దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహిస్తున్నారు. గురుపౌర్ణమి సందర్భంగా దైవసమానులైన గురువుల ఆలయాల్లో భక్తులు ఘనంగా వేడుకలను నిర్వహించారు. ప్రముఖంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన షిరిడీలో మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహింస్తున్నారు. గురుపౌర్ణమి సందర్భంగా బాబాను దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు షిరిడీ వెళ్ళారు. కాగా షిరిడీకి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.

అటు కర్నూలు జిల్లా మంత్రాలయంతో గురు రాఘవేంద్రస్వామి అలయానికి భక్తులు పోటేత్తారు. గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని భక్తులు పావనం అవుతున్నారు. దీంతో పాటుగా కర్ణాటకలోని గుల్బర్గా సమీపంలో వున్న గానుగాపూర్ లో గల గురుదత్త దేవాలయానికి కూడా భక్తులు పోటెత్తారు. అటు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు గురుదత్త ఆలయానికి కూడా తరలివెళ్లి గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. అటు పుట్టపర్తిలోనూ గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రశాంతి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలను సాయి ట్రస్టు సభ్యులు నిర్వహించారు

గురుపౌర్ణమి పురస్కరించుకుని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాలను శోభాయమానం తయారు చేశారు. గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబాను ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో సాయిబాబా ఆలయాలకు చేరుకుని పూజలు నిర్వహించారు. ఇటు భారత దేశంలోనే కాకుండా ఇండియాలోనే కాకుండా అమెరికాలాంటి దేశాల్లో ఏర్పాటైన సాయిబాబా ఆలయాల్లో నేటి తెల్లవారుజాముననే గురుపౌర్ణమి వేడుకలు ప్రారంభమయ్యాయి. న్యూజెర్సీలో ప్రవాసాంధ్రుల ఆధ్యర్యంలో ఏర్పాటైన సాయిబాబా ఆలయం భక్తులతో నిండిపోయింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shiridi sai  raghavendra swamy  dattatreya  puttaparthy  guru poornima  devotees  

Other Articles