Yakub Memon | Mumbai Blast | Memon | Yakib Memon Hanged, nagpur

1993 mumbai blasts convict yakub memon hanged in nagpur

Yakub Memon, Mumbai Blast, Memon, Yakib Memon Hanged, nagpur

1993 Mumbai blasts convict Yakub Memon hanged in Nagpur Yakub Memon, the lone convict sentenced to death in the 1993 Mumbai serial blasts case, was hanged to death at the Nagpur central jail on Thursday morning, less than two hours after the Supreme Court rejected his final plea in a dramatic legal tussle.

ITEMVIDEOS: యాకుబ్ మెమెన్ ఉరి.. మృతదేహానికి పోస్టుమార్టం

Posted: 07/30/2015 08:00 AM IST
1993 mumbai blasts convict yakub memon hanged in nagpur

కొంతకాలంగా ఉత్కంఠగా మారిన యాకుబ్ మెమన్ ఉరి ప్రక్రియ సజావుగా ముగిసింది. 1993 ముంబై పేలుళ్ల దోషి మెమన్‌కు నాగపూర్ జైళ్లో ఉదయం 6.50 గంటలకు ఉరి అమలు జరిపినట్టు జైలు అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం ఈ తెల్లవారుజాము ఒంటిగంటకు యాకుబ్‌ను నిద్రలేపిన అధికారులు ఫార్మాలటీస్‌ను పూర్తి చేశారు. అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు విచారించిన సుప్రీంకోర్టు చివరి పిటీషన్‌ను కూడా కొట్టివేయడంతో ఇక యాకుబ్ ఉరి ఖరారైపోయింది. కాగా ముందు నుంచీ సిద్ధంగా ఉన్న నాగపూర్ కేంద్ర కారగారం అధికారులు సుప్రీంకోర్టు తీర్పును సజావుగా అమలు చేశారు. అంతకుముందు బుధవారం రాత్రి తన అన్న, భార్య తదితరులను యాకుబ్ కలుసుకున్నారు.

ఈ ఉదయం 7 గంటల 1నిమిషానకి మెమెన్ మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించినట్లు సమాచారం. డిఐజి, సిఎంఓ, జైల్ సూపరిండెంట్, న్యాయమూర్తి ఎదుట మెమెన్ ను ఈ ఉదయం ఉరి తీశారు. కాగా 1993 ముంబై పలుళ్ల నిందితుడు యాకూబ్ మెమెన్ ఉరి శిక్ష అమలు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ముంబై, నాగపూర్ లలో కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతకు ముందు నిన్న ఉదయం నుంచి యాకూబ్ మెమెన్ ఉరి శిక్షపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉరి శిక్ష అమలును వాయిదా వేయాలన్న యాకూబ్ మెమన్ పిటిషన్ పై బుధవారం సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం సుదీర్ఘంగా విచారించింది. యాకుబ్ తరఫున రాజు రామరాజు వాదించారు. యాకూబ్ మెమన్ పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించిన అనంతరం ఉరిపై ఉత్కంఠ ప్రారంభమైంది. మహారాష్ట్ర గవర్నర్ యాకుబ్ మెమెన్ క్షమాభిక్షను ను తిరస్కరించారు. అయితే రాష్ట్రపతికి యాకుబ్ మెమెన్ నిన్న మరోసారి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశారు.

Yakub-memon-hanged

దాంతో రాష్ట్రపతి ఏం నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రపతి యాకుబ్ మెమన్ క్షమాభిక్ష దరఖాస్తును సాయంత్రం హోం శాఖకు పంపించారు. హోం శాఖ దానిని పరిశీలించిన అనంతరం న్యాయసలహా కూడా తీసుకుంది. అనంతరం రాత్రి హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ రాష్ట్రపతి తో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో రాజ్ నాథ్ సింగ్ యాకుబ్ మెమెన్ మెర్సీ పిటిషన్ ను తిరస్కరించాల్సిందిగా రాష్ట్రపతికి సూచించారు. దీంతో రాష్ట్రపతి సోలిసిటర్ జనరల్ తో సంప్రదించిన అనంతరం క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ లోగా రాత్రికి రాత్రి క్షమాభిక్షపై రాష్ట్రపతి నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ యాకుబ్ మెమెన్ తరఫు న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు న్యాయవాది ఇంటి వద్దే అర్ధరాత్రి దాటిన తరువాత దాదాపు రెండు గంటల పాటు విచారణ జరిగింది. చివరకు సుప్రీం కోర్టు మెమెన్ తాజా పిటిషన్ ను కూడా తిరస్కరించడంతో యాకూబ్ మెమెన్ ను గురువారం ఉదయం ఉరి తీశారు.

అర్దరాత్రి హైడ్రామా.. రాత్రి మూడు గంటల వరకు సాగిన సస్పెన్స్..

దేశ చరిత్రలోనే తొలిసారి.. అత్యున్నత న్యాయస్థానంలో అర్ధరాత్రి దాటాక విచారణ! యాకూబ్‌ మెమన్‌ ఉరి శిక్ష అమలును నిలిపి వేయాలంటూ అర్థరాత్రి దాటాక వేసిన పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు స్పందించారు. అప్పటికప్పుడు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ప్రఫుల్‌ చంద్రపంత్‌, అమితవ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేశారు. ఈ ధర్మాసనం అసాధారణ రీతిలో... గురువారం తెల్లవారుజామున విచారణ చేపట్టింది. 2.30 గంటలకు విచారణ చేపట్టనున్నట్లు తొలుత ప్రకటించారు. కానీ... తెల్లవారుజామున 3 గంటల దాకా విషయం తేలలేదు. అంతకుముందు ఇదే బెంచ్‌... యాకూబ్‌ మెమన్‌కు ఉరిశిక్షను సమర్థించింది. అయితే, జైలు మాన్యువల్‌ ప్రకారం క్షమాభిక్ష తిరస్కరణకు, ఉరిశిక్ష అమలుకు మధ్య 7 రోజుల అంతరం ఉండాలంటూ ప్రశాంత్‌ భూషణ్‌ వాదించేందుకు సిద్ధమయ్యారు. యాకూబ్‌ తరఫు న్యాయవాదులూ ఇదే వాదనలు వినిపించాలని నిర్ణయించుకున్నారు. విచారణ మొదలైంది. తెల్లవారుజామున నాలుగున్నర దాకా వాదోపవాదాలు కొనసాగాయి. డిఫెన్స్ వాదనలను ఏజీ ముకుల్ రోహత్గీ తీవ్రస్థయిలో తిప్పికొట్టారు. పదేపదే పిటిషన్లు వేస్తోందంటూ డిపెన్స్ తీరును ఓ ‘గేమ్’గా అభివర్ణించారు. ఈ కేసులో న్యాయ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని గుర్తుచేశారు. తాజా పిటిషన్ యాకూబ్ మెమన్‌ను కాపాడేందుకు రచించిన గేమ్ ప్లాన్ అని వాదించారు. ఈ తీరు న్యాయ ప్రక్రియకు అవరోధం కలిగించడమేనని పేర్కొన్నారు. ఇరు వైపులా వాదనలు విన్న సుప్రీం త్రిసభ్య ధర్మాసనం.. యాకూబ్ తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చారు.దీంతో, అతడికి ఉరి ఖాయమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yakub Memon  Mumbai Blast  Memon  Yakib Memon Hanged  nagpur  

Other Articles