Taliban's Mullah Omar died in 2013, Afghan government says

Mullah omar died two years ago taliban remain mum

Mullah Omar 'died two years ago', Taliban remain mum, Taliban's Mullah Omar died in 2013, Afghan government says, Mullah Omar, Taliban, Pakistan, Afghanistan, Taliban chief, Mullah Oma dead, Afghan Taliban’s supreme leader, Mullah Mohammad Omar, Afghan officials, no word from the militant group

The Afghan Taliban’s supreme leader, Mullah Mohammad Omar, has died, Afghan officials were quoted as saying by the media on Wednesday though there was no word from the militant group

తాలిబన్ ముఖ్యనేత ముల్లా మహమ్మద్ ఓమర్ మరణం నిజమే

Posted: 07/29/2015 10:38 PM IST
Mullah omar died two years ago taliban remain mum

తాలిబన్ అధినేత ముల్లా ఒమర్ హతమయ్యాడు. బిబిసి కథనం ప్రకారం ముల్లా ఒమర్ చనిపోయాడని ఆఫ్ఘన్ ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. అయితే దీనిపై తాలిబన్ వర్గాలు స్పందించడం లేదు. గత గురువారం ఖామా ప్రెస్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం ముల్లా ఒమర్ రెండేళ్ల క్రితమే హతమయ్యాడు. 2013 జులైలో జరిగిన తాలిబన్ కమాండర్లు ముల్లా అక్తర్, మహ్మద్ మన్సూర్ గుల్ అఘా చనిపోయారని ఆఫ్ఘనిస్థాన్ ఇస్లామిక్ మూమెంట్ ఫిదాయా మహజ్ సంస్థ అధికార ప్రతినిధి ఖారీ హంజా తెలిపాడు. తమ వద్ద కావాల్సినన్ని ఆధారాలున్నాయని వెల్లడించాడు.

ఆఫ్ఘనిస్థాన్ నిఘా సంస్థ ఎన్‌డిఎస్ కూడా గత నవంబర్‌లో దీన్ని ధృవీకరించింది. అయితే ఒమర్ బతికున్నాడా లేక చనిపోయాడా అనే విషయంపై అనేక అనుమానాలున్నమాట నిజమేనని, అతడు కరాచీలో తలదాచుకున్నాడని ఎన్‌డిఎస్ ఛీఫ్ రహమతుల్లా న్యూయార్క్ టైమ్స్‌తో చెప్పారు. అయితే ఒమర్ బతికే ఉన్నాడని, ఇటీవల జరుగుతున్న అన్ని ఘటనల వివరాలూ అతడికి అందుతున్నాయని మూడు నెలల క్రితం కూడా వార్తలు వచ్చాయి. ఒమర్ తలపై అమెరికా పది మిలియన్ డాలర్ల రివార్డు కూడా ప్రకటించింది.

ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా దాడులు ప్రారంభించిన 2001 నుంచీ ఒమర్ కనిపించడం లేదు. రెండు వారాల క్రితం ఆఫ్ఘన్ తాలిబన్ ముల్లా ఒమర్ పేర రంజాన్ సందేశం కూడా పంపింది. పస్తూన్ తెగకు చెందిన ఒమర్ ఆఫ్ఘనిస్థాన్ ఉరుజుగన్ ప్రాంతంలో 1959లో పుట్టాడు. ఆ తర్వాత 1979లో రష్యా సేనలకు వ్యతిరేకంగా జిహాద్‌లో చేరాడు. రష్యా సేనలతో పోరాడుతూ ఒక కన్ను పోగొట్టుకున్నాడు. కాందహార్ కేంద్రంగా ఏళ్లపాటు ఉగ్రవాద మూకలకు నేతృత్వం వహిస్తూ మారణ హోమానికి పాల్పాడ్డాడు. ఒమర్ హతమవడంతో తాలిబన్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mullah Omar  Taliban  Pakistan  Afghanistan  Taliban chief  

Other Articles