high court dismisses sujana Universal industries ltd plea, big blow to union minister sujana chaowdary

Sujana universal industries plea dismissed by hyderabad high court

Sujana Universal Industries' plea dismissed by Hyderabad High Court, Hyderabad high Court, Sujana Universal Industries Ltd, Mauritius Bank sujana chowdary, Justice Ramesh Ranganathan, Justice S. Ravi Kumar, Hyderabad High Court, Union minister Sujana Chowdary, order of a single judge, liquidation of Sujana Universal Industries Ltd

A division bench comprising Justice Ramesh Ranganathan and Justice S. Ravi Kumar of the Hyderabad High Court dismissed an appeal by Sujana Universal Industries Ltd, owned by Union minister Sujana Chowdary, challenging an order of a single judge in allowing a petition by the Mauritius Bank seeking the liquidation of the company.

కేంద్రమంత్రి సృజనా చౌదరికి హైకోర్టు ధర్మాసనంలో ఎదురుదెబ్బ..!

Posted: 07/29/2015 02:04 PM IST
Sujana universal industries plea dismissed by hyderabad high court

కేంద్ర మంత్రి సజనా చౌదరికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు చెందిన యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ వేసిన పిటీషన్ ఉమ్మడి హైకోర్టులో తిరస్కరణకు గురైంది. తమకు వ్యతిరేకంగా సింగిల్ జడ్జి న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును కోట్టివేయాలని కోరుతూ సుజనా ఇండస్ట్రీస్ దాఖలు చేసిన కంపెనీ అప్పీల్ ను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. అదే సమయంలో సుజనా ఇండస్ట్రీస్ మూసివేత కోసం మారిషస్ కమర్షియల్ బ్యాంక్ ఆరు నెలల పాటు పత్రికా ప్రకటన రూపంలో ఇవ్వద్దన్న సింగిల్ జడ్జి అదేశాన్ని సవాలు చేస్తూ సదరు బ్యాంక్ దాఖలు చేసిన పిటీషన్ ను ధర్మాసనం అనుమతించింది. ఈ విషయంలో సింగిల్ జడ్జి అదేశాన్ని కోద్దిగా సవరించింది. ప్రతికా ప్రకటన ఇచ్చే కాల వ్యవధిని ఆరు నెలల నుంచి ఐదు నెలలకు కుదించింది.

ఈ ఏడాది సెప్టెబర్ 30 నాటికి ఉన్న బకాయిలను సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చెల్లించకపోతే, ఆ వెంటనే కంపెనీ పిటీషన్ విచారణకు స్వీకరించిన విషయాన్ని ప్రతికా ప్రకటన ద్వారా తెలియచేయవచ్చునని ఎంసీబికి స్పష్టం చేసింది. ఈ మేరకు ద్విసభ్య బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎస్. రవికుమార్లతో కూడాన ధర్మాసనం తీర్పును వెలువరించింది. హిస్టీయా పేరుతో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ తమ అనుబంధ కంపెనినీన మారిషస్ లో ఏర్పాటు చేసి, మారిషస్ కమర్షియల్ బ్యాంకు నుంచి 100 కోట్ల రూపాయల మేర రుణం తీసుకుంది. ఈ లావాదేవీల్లో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ హామీదారుగా వుంది. బకాయిలను చెల్లించడంలో హిస్టియా కంపెనీ విఫలం కావడంతో గ్యారెంటర్ గా వున్న సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ పై ఎంసీడి ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించగా, సింగల్ జడ్జి తీర్పును వెలువరించారు. దీనిని సవాల్ చేస్తూ ద్విసభ్య బెంచ్ కు వెళ్లిన సుజనా సంస్థకు అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles