RIP APJ Abdul Kalam: On Twitter, Bollywood and Tollywood Mourns Former President

Bollywood and tollywood mourns inspirational apj abdul kalam s demise

Bollywood and Tollywood mourns Abdul Kalam's demise, APJ Abdul Kalam, Shah Rukh, shah rukh and salman, apj, Lata Mangeshkar, Anupam Kher, ss rajamouli, ram charan tej, mahesh babu, A R Rahman, bala krishna, bollywood, Tollywood, Dr Kalam's death, Kalam's death, Amitabh bachan, salman khan, alia bhatt, karan johar, sonashi sinha, anushka sharma,

Celebrities including Lata Mangeshkar, Anupam Kher and Shah Rukh Khan expressed their grief over Dr Kalam's death

అబ్దుల్ కలాం మృతిపట్ల బాలీవుడ్, టాలీవుడ్ సంతాపం

Posted: 07/28/2015 02:02 PM IST
Bollywood and tollywood mourns inspirational apj abdul kalam s demise

మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం మృతిపట్ల సినీపరిశ్రమలు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. అటు బాలీవుడ్ పరిశ్రమలోని ప్రముఖులతో పాటు ఇటు తెలుగు సినీపరిశ్రమ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా బాలీవుడ్ ప్రముఖు నటలు, నటీమణులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, శ్రద్ధా కపూర్, అలియాభట్, కరణ్ జోహార్, సోనాక్షి సిన్హా, అనుష్కా శర్మ తదితరులు సంతాపం తెలిపారు. కలాం మృతి దేశానికి తీరని లోటని అమితాబ్ తన సందేశంలో తెలిపారు. కలాం నిరాడంబరత ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని అన్నారు. కలాం దేశానికి చేసిన సేవలకు జాతి మొత్తం ఆయనకు రుణపడి ఉంటుందన్నారు. ఆయన లేరన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని బాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా తమ సందేశాన్ని తెలియజేశారు. కలాం ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.

ఇటు తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్ కు చెందిన దర్శకులు, నటులు అబ్దుల్ కలాంకు సంతాపాన్ని ప్రకటించారు. ఆయన లోటును భర్తీ చేయడం ఎవరి వల్ల కాదని టాలీవుడ్ సెలబ్రీటీలు కలాం సేవల్ని గుర్తు చేసుకున్నారు. కలాం సేవలు దేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచంలో అగ్రగామిగా నిలపడంతో దోహదపడ్డాయని పలువురు ప్రముఖులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కలాం మన కంటి చూపుకి మాతరమే దూరమయ్యారని, కలల్ని సాకారం చేసుకునే ప్రతీ ఒక్కరి  హృదయాలలో ఎప్పటికీ చిరస్మరణీయులుగానే నిలిచివుంటారని దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు అన్నారు.

* భారతజాతికి మీరు మార్గదర్శకులు, మీకు మేము ఎంతో రుణపడి వుంటాం- రాజమౌళి
* మానవత్తానికి రోల్ మోడల్ అబ్దుల్ కలాం- రాజేంద్రప్రసాద్ మా అధ్యక్షుడు
* దేశ యువతకు కలాం.. ఓ స్పూర్తిదాయక నాయకుడు-రామ్ చరణ్
* శాస్త్రీయ పరిశోధన వైతాళికుడు అబ్దుల్ కలాం- మహేష్ బాబు
* దేశం ఒక మార్గనిర్ధేశకుడిని, గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయింది.. ఆయన అడుగుజాడల్లోనే మనం నడవాలి-జూ.ఎన్టీయార్
* కలాం గారికి నేను ఏకలవ్య శిష్యుణ్ని-నారా రోహిత్
* కలాం స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు-అల్లరి నరేష్
* కలాం మృతి దేశానికి తీరని లోటు- నందమూరి బాలకృష్ణ

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : APJ Abdul Kalam  bollywood  Tollywood  mourns  Twitter  

Other Articles