Abdil Kalam | Abdul Kalam Death | APJ Abdul Kalam

There no words to write on abdul kalam death news

Abdil Kalam, Abdul Kalam Death, APJ Abdul Kalam

there No words to write on Abdul kalam death news. The words also crying for abdul kalam.

కలాం గురించి అక్షరాలు ఏడుస్తున్నాయ్

Posted: 07/28/2015 09:40 AM IST
There no words to write on abdul kalam death news

ఎక్కడ ఎవరు చనిపోయినా వెంటనే ఫలానా వ్యక్తి చనిపోయారు అంటూ రాసేస్తుంటారు. కానీ నిన్న భారత ధృతతార నేల విడిచి నింగికేగిన సమయంలో అక్షరాలు కన్నీళ్లు పెట్టుకున్నాయ్.. నా జీవితంలో ఇలాంటి విషయం మీద రాయాల్సి వస్తుందా అని శోకంలో మునిగిపోయాయి. కన్నీటి వీడ్కోలుకు అందరూ సిద్దపడుతున్నారు.. కడసారి చూపు కోసం కొన్ని కోట్ల కళ్లు ఎదురుచూస్తున్నాయి... తన బిడ్డ మరణాన్ని దిగ మింగుకొని తల్లి భూభారతి దిక్కులు పెక్కటిల్లేలా రోధిస్తోంది.. కల్మషం లేని కర్షకుడికి యావత్ ప్రపంచం సలాం చేస్తోంది.. అలుపెరుగని బాటసారికి.. తిరిగి రాని ప్రయాణానికి అంతా సిద్దమవుతోంది. భారత చరిత్రలో తనకంటూ ఓ పేజీని స్వయంగా రాసుకున్న ఓ సామాన్యుడు, ఓ శాస్ర్తవేత్త, ఓ యోగి, ఓ మేధావి అబ్దుల్ కలాం.

భారత మాత గుండెలదిరేలా ఏడుస్తోంది...
కోట్ల చిన్నారుల ప్రాణాలు నీ రాకకై వేచిచూసే...
నీవు లేని భారతమాత మొహంలో ఏదో వెలతి..
నీవు రావు అన్న వార్త అందరికి భ్రాంతి..
నీవు నింపావు ఎన్నో కోట్ల మంది జీవితాల్లో కాంతి..
దేవుడినైనా నిలదీస్తాం.. మిమ్మల్ని తీసుకెళ్లి ఏం చేసుకుంటావని..
నువ్వు తిరిగి వస్తావంటే ఏదేని చేస్తాం..
కానీ ఇక రావు కదా.. అందుకే పలుకుతున్నాం.. తుది వీడ్కోలు..
అబ్దుల్ కలాం... ప్రతి భారతీయుడి గుండెలో చిత్రమైన చిత్రం
ప్రతి చిన్నారి పెదవుల మీద కురిసే నవ్వు
ప్రతి శాస్ర్తవేత్తకు దారి చూపే మార్గదర్శి

మార్గదర్శి మళ్లీ రా... వీలైతే మరోసారి ఇక్కడే పుట్టు

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Abdil Kalam  Abdul Kalam Death  APJ Abdul Kalam  

Other Articles