Abdul Kalam | APJ Abdul Kalam | Abdul Kalam Died, Abdul kalam Inspire many

The time also salute apj abdul kalam for his inspirational life

Abdul Kalam, APJ Abdul Kalam, Abdul Kalam Died, Abdul kalam Inspire many

The Time also Salute APJ Abdul Kalam for his Inspirational life. Former President, top scientist, Bharat Ratna.... These are just some of the titles that come before the name of APJ Abdul Kalam who died today in Shillong, collapsing in the middle of what he loved doing most -- talking to students. In this case, the students of the Indian Institute of Management. He was 83.

కాలం తలవంచి కలాంకు గులాం అంది

Posted: 07/28/2015 08:41 AM IST
The time also salute apj abdul kalam for his inspirational life

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం కన్నుమూశారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్‌లో ప్రసంగిస్తుండగా అస్వస్థతకు గురై కుప్పకూలారు. చికిత్స కోసం బెథానీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్సఅందించారు. చికిత్స పొందుతూ కలాం తుదిశ్వాస విడిచారు. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో 1931 అక్టోబర్ 15న కలాం జన్మించారు.

చిన్నప్పటి నుంచి కష్టపడే మనస్తత్వం ఉన్న కలామ్‌ తన చదువు కోసం ఇంటి ఇంటికి తిరిగి వార్తా పత్రికలు పంచేవాడు. రామనాథపురం స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో తన స్కూల్‌ విద్య పూర్తి చేశాక... తిరుచిరాపల్లిలోని సెయింట్‌ జోసెఫ్‌ కళాశాలలో భౌతికశాస్త్రంలో పట్టా పొందారు. భౌతికశాస్త్రం అభ్యసించారు. చెన్నైలోని మద్రాస్‌ ఇనిస్ట్సిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ పట్టా అందుకున్నారు. DRDOతో పాటూ ఇస్రోలో ఏరీస్పేస్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. మిసైల్‌ మాన్‌ అనే బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగానికి కృషి చేశారు. 1998లో అణు పరీక్షల్లో కీలకపాత్ర పోషించారు.

Also Read:  కలాం.. చరిత్ర కూడా నిను మరువదు

మద్రాస్‌ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పట్టా పొందిన తర్వాత 1960లో DRDO, ఏరోనాటికల్ డెవెలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాస్త్రవేత్తగా చేరారు కలాం. భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్  చేయడం ద్వారా తన వృత్తిని ప్రారంభించారయన. అయితే DRDOలో ఉద్యోగం చేయడంతో ఆయన సంతృప్తి చెందలేదు. 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహన ఎస్‌ఎల్వీ-3కి  డైరెక్టర్ గా పనిచేశారు. 1980 జూలైలో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్యలో విజయవంతంగా చేర్చినది. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు కలాం. 1970-1990మధ్య కాలంలో కలాం పోలార్ SLV మరియు SLV-III ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. రెండు ప్రాజెక్ట్లులు విజయవంతం అయ్యాయి.

జూలై 1992 నుంచి డిసెంబర్ 1999 మధ్య ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారుగా ఢిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ముఖ్యకార్యదర్శి గా వ్యవహరించారు. 1998లో కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమ రాజుతో కలిసి తక్కువ ధర కలిగిన కొరోనరీ స్టెంట్‌ను అభివృద్ధి చేశారు. 2012 లో ఇద్దరూ కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కోసం కలాం రాజు టాబ్లెట్ PC రూపొందించారు. అలాగే ఇండియా 2020... వై.ఎస్.రాజన్... అన్లీషింగ్ ద పవర్ వితిన్ ఇండియా, ఇండియా మై డ్రీం, ఎన్విజనింగ్ ఎన్ ఎంపవర్డ్ నేషన్ పుస్తకాలను రచించారు. కలామ్‌ ఎన్నో అవార్డులను అందుకున్నారు. 1981లో పద్మభూషణ్‌... 1990లో పద్మ విభూషణ్‌.  1997లో భారతరత్న అవార్డు అందుకున్నారు. 1998లో వీర్‌ సావర్కర్‌... 2000లో రామానుజన్‌ అవార్డులను అందుకున్నారు. 2014లో సైన్స్‌ డాక్టరేట్‌ను ఎడిన్‌బర్గ్ యూనివర్శిటీ నుంచి అందుకున్నారు.

Also Read: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కన్ను మూత

ఈ రోజున దేశంలో చెప్పుకోతగ్గ క్షిపణి ప్రయోగాలన్నింటి వెనుకా కలాం ముద్ర ఉంది. ప్రపంచం ఉలిక్కిపడేలా చేసిన పోఖ్రాన్ అణు పరీక్షల్లోనూ కలాం కీలక పాత్ర పోషించారు. అందుకే ఆ మిస్సైల్ మేన్‌కు శాస్త్రలోకం కన్నీటి నివాళులు అర్పిస్తోంది. ఆధునిక యుగంలో యుద్ధరంగం తీరు మారింది. అత్యాధునిక టెక్నాలజీతో అమెరికా, రష్యా... తదితర దేశాలు ముందుకు దూసుకుపోతున్న తరుణంలో భారత సైన్య దశ, దిశ మార్చేశారు కలాం. దూరశ్రేణి క్షిపణులతో పాటు రకరకాల క్షిపణుల్ని రూపొందించి... రక్షణరంగంలో భారత ప్రతిభను రెపరెపలాడించిన అనితర దేశభక్తుడు అబ్దుల్‌కలాం.

పృథ్వీ, అగ్ని, ఆకాశ్, త్రిశూల్, నాగ్... తదితర క్షిపణులు కలాం కృషితో రూపొందినవే. నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లే అగ్ని బాలిస్టిక్ క్షిపణి పరీక్షతో భారత్ శక్తి సామర్థ్యాలు ప్రపంచ దేశాలకు తెలిసొచ్చాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్షిపణుల్ని రూపొందించడం విశేషం. శాస్త్ర రంగానికి 40 ఏళ్లపాటు సేవలు1960లో డీఆర్‌డీవో, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాస్త్రవేత్త 1969లో పీఎస్‌ఎల్‌వీ 3కి డైరెక్టర్

ఓ శాస్త్రవేత్తగా 40 ఏళ్లపాటు సుదీర్ఘ ప్రయాణం చేశారు కలాం. మద్రాస్‌ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పట్టా పొందిన కలాం... 1960లో DRDO, ఏరోనాటికల్ డెవెలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాస్త్రవేత్తగా చేరారు. భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్  చేయడం ద్వారా తన వృత్తిని ప్రారంభించారయన. DRDOలో ఉద్యోగం చేయడంతో ఆయన సంతృప్తి చెందలేదు. 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహన ఎస్‌ఎల్వీ-3కి  డైరెక్టర్‌గా పనిచేశారు. 1980 జూలైలో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్యలో విజయవంతంగా చేర్చింది. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు కలాం. 1970-1990మధ్య కాలంలో కలాం పోలార్ SLV మరియు SLV-III ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. ఈ రెండు ప్రాజెక్ట్లులు విజయవంతం అయ్యాయి.

జూలై 1992 నుంచి డిసెంబర్ 1999 మధ్య ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారుగా... డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించారు. 1998లో భారత్ జరిపిన రెండో పోఖ్రాన్ అణు పరీక్షల్లో, కీలకమైన, సంస్థాగత, సాంకేతిక పాత్ర పోషించారు. అదే ఏడాది కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమ రాజుతో కలిసి తక్కువ ధర కలిగిన కొరోనరీ స్టెంట్‌ను అభివృద్ధి చేశారు. ఇలా గుండెకు స్టెంట్ కనిపెట్టిన కలాం... అదే గుండెపోటుతో కన్నుమూయడం విధివైపరీత్యమే. ఐతే... 2012లో సోమరాజుతో కలిసి... గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కోసం కలాం -రాజు టాబ్లెట్ PC రూపొందించారు కలాం. అలాగే ఇండియా 2020... వై.ఎస్.రాజన్... అన్లీషింగ్ ద పవర్ వితిన్ ఇండియా, ఇండియా-మై-డ్రీం, ఎన్విజనింగ్ ఎన్ ఎంపవర్డ్ నేషన్ పుస్తకాల్ని రచించారు. వింగ్స్ ఆఫ్ ఫైర్... కలాం ఆత్మకథ. ఇందులో తన జీవితాన్ని పూసగుచ్చారు.  ఓ శాస్త్రవేత్తగా భారత శాస్త్రరంగంపై కలాం సృష్టించిన చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఇప్పటి ఇస్రో సహా యువ శాస్త్రవేత్తలకు ఆయనే పాత్ ఫైండర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Abdul Kalam  APJ Abdul Kalam  Abdul Kalam Died  Abdul kalam Inspire many  

Other Articles