Abdul Kalam | APJ AbdulKalam | History

Even hisotry also never forget apj abdul kalam name

Abdul Kalam, APJ AbdulKalam, History

Even Hisotry also never forget APJ Abdul kalam Name. APJ Abdul Kalam who discover his own disteny and inspired to many others.

కలాం.. చరిత్ర కూడా నిను మరువదు

Posted: 07/27/2015 11:37 PM IST
Even hisotry also never forget apj abdul kalam name

చరిత్రలో పేజీలకెక్కే వాళ్లు తక్కవగా ఉంటారు. కానీ చరిత్రకు కూడా మరుపురాని వాళ్ల సంఖ్యను వేళ్ల మీద లెక్కించవచ్చు. అలాంటి వాళ్లలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు తప్పక ఉంటుంది. ఏపీజే అబ్దుల్ కలాం.. ఇది కేవలం పేరు కాదు... ఎంతో మందికి నూతనొత్తేజాన్ని నింపే ఇంధనం. దేశ యవనికమై తన రూపును తానే లిఖించుకున్న మహానుభావుడు. కలామ్‌ పూర్తి పేరు అవుల్‌ పకీర్‌ జైనులుదీన్‌ అబ్దుల్‌ కలామ్‌. 1931 అక్టోబర్‌ 15న తమిళనాడులోని రామేశ్వరంలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు.

చిన్నప్పటి నుంచి కష్టపడే మనస్తత్వం ఉన్న కలామ్‌ తన చదువు కోసం ఇంటి ఇంటికి తిరిగి వార్తా పత్రికలు పంచేవాడు. రామనాథపురం స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో తన స్కూల్‌ విద్య పూర్తి చేశాక... తిరుచిరాపల్లిలోని సెయింట్‌ జోసెఫ్‌ కళాశాలలో భౌతికశాస్త్రంలో పట్టా పొందారు. భౌతికశాస్త్రం అభ్యసించారు. చెన్నైలోని మద్రాస్‌ ఇనిస్ట్సిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ పట్టా అందుకున్నారు. DRDOతో పాటూ ఇస్రోలో ఏరీస్పేస్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. మిసైల్‌ మాన్‌ అనే బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగానికి కృషి చేశారు. 1998లో అణు పరీక్షల్లో కీలకపాత్ర పోషించారు.

మద్రాస్‌ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పట్టా పొందిన తర్వాత 1960లో DRDO, ఏరోనాటికల్ డెవెలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాస్త్రవేత్తగా చేరారు కలాం. భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్  చేయడం ద్వారా తన వృత్తిని ప్రారంభించారయన. అయితే DRDOలో ఉద్యోగం చేయడంతో ఆయన సంతృప్తి చెందలేదు. 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహన ఎస్‌ఎల్వీ-3కి  డైరెక్టర్ గా పనిచేశారు. 1980 జూలైలో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్యలో విజయవంతంగా చేర్చినది. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు కలాం. 1970-1990మధ్య కాలంలో కలాం పోలార్ SLV మరియు SLV-III ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. రెండు ప్రాజెక్ట్లులు విజయవంతం అయ్యాయి.

జూలై 1992 నుంచి డిసెంబర్ 1999 మధ్య ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారుగా ఢిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ముఖ్యకార్యదర్శి గా వ్యవహరించారు. 1998లో కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమ రాజుతో కలిసి తక్కువ ధర కలిగిన కొరోనరీ స్టెంట్‌ను అభివృద్ధి చేశారు. 2012 లో ఇద్దరూ కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కోసం కలాం రాజు టాబ్లెట్ PC రూపొందించారు. అలాగే ఇండియా 2020... వై.ఎస్.రాజన్... అన్లీషింగ్ ద పవర్ వితిన్ ఇండియా, ఇండియా మై డ్రీం, ఎన్విజనింగ్ ఎన్ ఎంపవర్డ్ నేషన్ పుస్తకాలను రచించారు. కలామ్‌ ఎన్నో అవార్డులను అందుకున్నారు. 1981లో పద్మభూషణ్‌... 1990లో పద్మ విభూషణ్‌.  1997లో భారతరత్న అవార్డు అందుకున్నారు. 1998లో వీర్‌ సావర్కర్‌... 2000లో రామానుజన్‌ అవార్డులను అందుకున్నారు. 2014లో సైన్స్‌ డాక్టరేట్‌ను ఎడిన్‌బర్గ్ యూనివర్శిటీ నుంచి అందుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Abdul Kalam  APJ AbdulKalam  History  

Other Articles