Terror attack | Punjab

How the terrorists attacking on india several times

Terror attack, Terror, Terrorists, Punjab, Punjab Attack, Punjab Police

How the Terrorists attacking on India several times. Terror attacks are going in india by Trained terrorists which cause number of normal people and some security officials.

ఉగ్రవాదులకు అవకాశం కల్పిస్తోంది ఏంటి..?

Posted: 07/27/2015 04:23 PM IST
How the terrorists attacking on india several times

ఉగ్రవాదులు భారత పార్లమెంట్ మీద దాడికి పాల్పడ్డారు..... ఎంతో మంది సైనికులు, మామూలు జనాలు ప్రాణాలు కోల్పోయారు... అయినా మార్పు రాదు. దేశంలో ఎన్నిసార్లు దాడులు చేస్తున్న ఉగ్రవాదలు దాడులను కట్టడి చెయ్యడంలో ఇప్పటికీ విఫలమవుతున్నాం. తాజాగా పంజాబ్ లో సూర్యుడు రాకముందు నుండి ప్రారంభమైన ఉగ్రవాదుల కాల్పుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పదమూడు మంది చనిపోగా మరో పది మందికి గాయాలైనట్లు సమాచారం. కాగా గతంలో పోలిస్తే ఈ దాడిలో రక్తపాతం తక్కువే. ఇలా రాయడానికి సిగ్గుగా ఉన్నా కానీ నిజం గతంలో అంత మంది చనిపోయారు కానీ ఈ సారి మాత్రం కొంత మంది మాత్రమే చనిపోయారు అని రాయడానికి చింతిస్తున్నా.,  మరి ఇలా ప్రతీసారి జరగడానికి కారణాలు ఏంటి..? ఉగ్రవాదులు భారీగా ఆయుధాలతో మారణహోమం సృష్టిస్తున్నా.. మన ప్రభుత్వాలు ఎందుకు ఇలాంటివి జరగకుండా అడ్డుకట్ట వెయ్యలేకపోతున్నాయి.

భారతదేశం విస్తీర్ణంపరంగా ఎంతో విశాలమైంది.. అనేక రకాల మనుషులు ఇక్కడ ఉంటున్నారు. భారత్ గురించి ఎంత కీర్తప్రతిష్టలు ఉన్నాయో.. ఇక్కడ జరిగే ఉగ్రవాద దాడుల గురించి కూడా అంతే రికార్డ్ ఉంది. ముంబై దాడుల ఘటనను ఎవరూ మరిచిపోలేరు. అమెరికాలో ట్విన్ టవర్స్ మీద దాడి ఎలా మానవజాతి చరిత్రలో చీకటి కోణాన్ని ఆవిష్కరించిందో.. భారత యవనికపై ముంబై దాడి మాయని మచ్చగా మారింది. తాజాగా మరోసారి పంజాబ్ లో ఉగ్రవాదులు రక్తపాతాన్ని సృష్టించారు. ఓ ఎస్పీ, ముగ్గురు హోంగార్డులు, నలుగురు సామాన్య జనాల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల మీద ఆపరేషన్ సాగుతోంది. గత పదకొండు గంటలుగా ఉగ్రవాదలకు, పోలీసుల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతూ ఉన్నాయి.

చెట్టు మంచిది అయితే కాయ ఆటోమేటిక్ గా మంచిదవుతుంది అని ఓ సినిమాలో డైలాగ్ ఉంది. అదే విధంగా దేశంలో వ్యవస్థలు అన్ని కరెక్ట్ గా పని చేస్తుంటే ఎలాంటి ఘటనలకు, ఎలాంటి తప్పులకు తావుండదు. కానీ తప్పు వ్యవస్థలో ఉంది... దానికి ప్రభుత్వాన్ని వ్యక్తులను బాధ్యులుగా చెయ్యడం ఎ:త వరకు సమంజసం. ఉగ్రవాదులు దాడులు చేస్తున్నా ఏమీ చెయ్యలేని చేతగాని ప్రభుత్వం.. ఇది చిన్నప్పటి నుండి వినిపిస్తున్న మాటలే. అయినా తప్పు గతంలోఎన్నడూ జరగలేదు.. కొత్తగా దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అన్నట్లు మాట్లాడతారు ప్రతిపక్షాల నేతలు. అయ్యా... నిజానికి అక్కడ ఏం జరుగుతుంది... ఎవరు ఏం చెయ్యగలుగుతారో బాగా తెలుసు అయినా కానీ మైకుల ముందు మాత్రం ఊగిపోతుంటారు మరి. ఇంకా ఎన్నాళ్లు ఇలా నాటకాలు ఆడతారు.

దేశ చరిత్రలో ఇప్పటి వరకు జాతిని సంఘటితం చేసిన ఘటన ఏదైనా ఉందీ అంటే అది కార్గిగ్ యుద్దం మాత్రమే. కార్గిల్ యుద్దం సమయంలో దేశంలో అన్ని ప్రాంతాల నుండి అందరి దగ్గరి నుండి పూర్తి మద్దతు వచ్చింది. కానీ అదే స్పూర్తి ప్రతీసారి ఎందుకు రాదు..? ఆ స్పూర్తి రాకపోవడానికి కారణం ఏంటి.? దానికి మాత్రం సమాధానాలు చాలా కష్టం. ఎవరికి వాళ్లు రకరకాల కారణాలు చెబుతుంటారు. అందులో మనకు నమ్మదగినవి అనిపిస్తే నమ్మొచ్చు.  ఉగ్రవాదులు చేస్తున్న కార్యక్రమాల మీద నిఘా వర్గాలు పూర్తి సమాచారాన్ని అందించలేకపోవడం.. నిఘా వర్గాల హెచ్చరికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో అమలుచెయ్యలేకపోవడం భారత్ లో హింసకు కారణాలు. సంక్షేమ పథకాల మీద పూర్తి దృష్టిసారించే నేతాగణం అంతకన్నా ముందు ప్రజల భద్రత మీద దృష్టిసారించాలి. దేశంలో హింసకారణంగా ఒక్క ప్రాణం కూడా కోల్పోనపుడు దేశ భద్రతకు ఢొకా లేదు అనే నమ్మకం వస్తుంది. కానీ ఈ నమ్మకం వస్తుందన్న నమ్మకం ఇస్పట్లో కలిగేలా లేదు.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Terror attack  Terror  Terrorists  Punjab  Punjab Attack  Punjab Police  

Other Articles