Supreme Court notice to Jayalalithaa after Karnataka challenged acquittal | Assets Case

Supreme court notice to jayalalitha karnataka challenged acquittal

jayalalitha news, jayalalitha assets case, jayalalitha petition, supreme court of india, india supreme court, karnataka high court, assets cases, karnataka govt, illegal farce cases

Supreme Court notice to Jayalalitha Karnataka challenged acquittal : The Supreme Court on Monday issued notice to Tamil Nadu Chief Minister J Jayalalithaa on Karnataka's appeal against her acquittal in the illegal assets case.

‘అమ్మ’కు మళ్లీ మొదలైన ‘అక్రమాస్తుల’ తలనొప్పి..?

Posted: 07/27/2015 01:00 PM IST
Supreme court notice to jayalalitha karnataka challenged acquittal

దాదాపు 18 సంవత్సరాల విచారణ అనంతరం ‘అక్రమాస్తుల’ కేసులో దోషిగా తేలిన పురచ్చితలైవి జయలలిత.. ఏకంగా తమిళనాడు సీఎం పీఠాన్నే కోల్పోవాల్సి వచ్చింది. అయితే.. దీనిని సవాల్ చేస్తూ ఆమె కర్నాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ను కోర్టు స్వీకరించగా.. తీర్పు ఎలా వెలువడుతుందోనని కొన్నాళ్లపాటు తీవ్ర ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఈమె నిర్దోషిగా బయటపడాలంటూ ఈమెను ఆరాధ్యదైవంగా భావించే తమిళతంబీలు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. చివరికి హైకోర్టు తీర్పు ఈమెకు అనుకూలంగా వెలువడటంతో ఆమె తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించగలిగారు.

జయలలిత తిరిగి సీఎం అవ్వడంతో తమిళతంబీలు సంతోషంగా సంబరాలు జరుపుకోవడం అంతా జరిగిపోయింది. అంతా సవ్యంగానే జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అమ్మకు మళ్లీ ‘అక్రమాస్తుల’ తలనొప్పి వచ్చిపడింది. అక్రమాస్తుల కేసు నుంచి జయమ్మను నిర్దోషిగా కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. సోమవారం ఉదయం జయలలితకు నోటీసులు జారీ చేసింది. దీంతో తమిళ తంబీళ్లో మరోసారి ఆందోళన వాతావరణం నెలకొంది. ఉన్నట్లుండి ఇలా నోటీసులు రావడంతో అన్నాడీఎంకే వారు టెన్షన్ లో మునిగిపోయినట్లు సమాచారం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalitha  supreme court  assets case  karnataka govt  

Other Articles