vyapam scam | cbi | shivaraj singh chouhan | madyapradesh

The supreme court respond on the vyapam scam

vyapam scam, cbi, shivaraj singh chouhan, madyapradesh

The Supreme Court has directed municipal bodies not to insist on the name of the father while issuing birth certificates for children born outside wedlock, saying that in such cases, it should mention only the mother's name.

వ్యాపం మిస్టరీ మరణాలపై సుప్రీం జోక్యం.. ఈ నెల 9న విచారణ

Posted: 07/07/2015 01:29 PM IST
The supreme court respond on the vyapam scam

మధ్య ప్రదేశ్‌ వ్యాపం స్కాంలో మరణాలు ఆగడంలేదు. 48 గంటల్లో ఓ విలేకరి, వైద్యుడు మరో ట్రైనీ సబ్‌ఇన్‌స్పెక్టర్ మరణించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. దీంతో మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ శింగ్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ తన దాడిని తీవ్రం చేసింది. ఈ  కుంభకోణంతో సంబంధమున్న వారంతా వరసగా మరణిస్తుంటే తనకు ఏం తెలియనట్టు,సీఎం, ప్రధాన మంత్రి వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ స్కాంను సుప్రీం కోర్టు  పర్యవేక్షణలో సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.

Also Read:  సీఎం చౌహాన్ కూడా వ్యాపం కుంభకోణంలో దోషే

ఆమ్ ఆద్మీ పార్టీ కూడా  సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.  కేసును హైకోర్టు  పరిశీలిస్తున్నా అనుమానాస్పద మరణాలు ఆగడంలేదని అందుకే సుప్రీం కోర్టు కలగజేస్కోవాలని కోరింది. ఈ కేసుకు సంబంధించి గత 48 గంటల్లో  ముగ్గురు అనుమానాస్పదంగా మరణించారు.  ఇప్పటికే విలేకరి అక్షయ్‌ సింగ్, మరో వైద్యుడు మరణించగా తాజా ఓ మహిళా ట్రైనీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మృతదేహం  పోలీస్‌ ట్రైనింగ్  అకడామీ దగ్గర కనిపించింది. మరోవైపు ఈకేసును పరిశీలిస్తున్న  ప్రత్యేక దర్యాప్తు బృందం  పాట్నా మెడికల్‌ కాలేజ్‌  చేరుకొని విచారణ చేపట్టింది.

దీంతో ఈ కేసు గురించి బైటపెట్టిన అశిష్ చతుర్వేది తనకు ప్రాణ భయం ఉందని.. సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ కు ఈ కేసుతో సంబంధముందని చెప్పి సంచలన సృష్టించాడు. అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చారు చౌహాన్‌. ఈ మరణాలకు, వ్యాపం కేసుకు సంబంధంలేదని సీఎం చౌహాన్‌ తెలిపారు. అయితే వ్యాపం వ్యవహారంపై తనక్కూడా ప్రాణ భయం ఉంది అని కేంద్ర మంత్రి ఉమా భారతి అన్నారు. కాగా ఓ నిందితుడు చెప్పిన దాని ఆధారంగా తన పేరును కేసులో చేర్చడం తనకు దిగ్ర్భాంతిని కలిగించిందని ఉమాభారత పేర్కొంది.

Also Read:  వ్యాపమ్ స్కాంలో కలకలం రేపుతున్న వరుస అనుమానాస్పద మరణాలు..

వరుస మరణాలతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీని తలపిస్తున్న వ్యాపమ్ స్కామ్‌పై సుప్రీంకోర్టు స్పందించింది.ఈ కుంభకోణానికి సంబంధించి దాఖలైన 9 పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.ఈ స్కామ్‌సై సీబీఐ విచారణ జరిపించాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలంటూ దిగ్విజయ్, కుమార్ విశ్వాస్ సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు ఈ పిటిషన్లపై స్పందించిన కోర్టు ఈ నెల 9న విచారణ జరుపుతామని వెల్లడించింది.

 

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vyapam scam  cbi  shivaraj singh chouhan  madyapradesh  

Other Articles