Sandra | TDP | Chandrababu Naidu | Ap | Ministers | ACB | Telangana, Cash for Vote case

Telugudesam party leaders and president chandrababu naidu are in tension mood

Sandra, TDP, Chandrababu Naidu, Ap, Ministers, ACB, Telangana, Cash for Vote case

Telugudesam Party leaders and President Chandrababu Naidu are in tension mood. TDP Leaders or ap ministers didnt comment or even didnt give any statement on Sandra arrest.

సండ్ర అరెస్టుతో టిడిపిలో టెన్షన్.. టెన్షన్

Posted: 07/07/2015 08:18 AM IST
Telugudesam party leaders and president chandrababu naidu are in tension mood

రేవంత్ రెడ్డి ఎలాగోలా బయటకు వచ్చాడు కదా అని అనుకుంటున్నారో అప్పుడే తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేను ఏసీబీ అధికారులు అరెస్టు చెయ్యడం టిడిపి నాయకులను కలవరపెడుతోంది. ఉదయం నుండి విచారణ ప్రారంభించిన తెలంగాణ ఏసీబీ అధికారులు సాయంత్రం పూట సండ్రను అరెస్టు చేశారు.  సండ్ర అరెస్టయిన వెంటనే పార్టీ నేతలు, మంత్రులు జపాన్ టూర్‌లో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబుకు విషయాన్ని చేరవేశారు. అప్పటినుంచి చంద్రబాబు తాజా పరిస్థితులపై ఏపీ పోలీస్ ఉన్నతాధికారులతో ఫోన్, వీడియో కాలింగ్‌లో ఆరా తీసినట్లు తెలిసింది. ప్రతి అర్ధగంటకూ ఏపీ డీజీపీ రాముడును లైన్‌లోకి తీసుకుని ఎలా ముందడుగు వేయాలి..? ఇంకా తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు ఎవరెవరికి ఇచ్చే అవకాశాలున్నాయి.. అంటూ ఆరా తీసినట్లు సమాచారం.

Also Read:  ఓటుకు నోటు కేసులో మరో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర అరెస్టు

ఇప్పటికే ఏపీలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పని తీరు బాగోలేదని ఆగ్రహించిన చంద్రబాబు అనురాధను పక్కనపెట్టి కొత్త చీఫ్‌ను నియమించిన రోజే మరో ఎమ్మెల్యే అరెస్టయ్యారు. దీంతో మనిషి జపాన్‌లో ఉన్నప్పటికీ మనసు హైదరాబాద్‌లో అన్నట్లుగా చంద్రబాబు పరిస్థితి తయారైంది. ఇంటెలిజెన్స్ నూతన చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వరరావుతో కూడా చంద్రబాబు మాట్లాడినట్లు తెలిసింది. ఇక ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆడియోను పరిశీలించిన ఫోరెన్సిక్ అధికారులు దానికి సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించారు. ఆడియోలోని గొంతు చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ విభాగం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. అయితే దానిని పక్కాగా నిర్ధారణ చేసుకోవాలంటే, చంద్రబాబు వాయిస్ తీసుకుని, ఆడియోలో ఉన్న వాయిస్‌ను సరిపోల్చాల్సి ఉంటుంది. అప్పుడు చంద్రబాబుకు కూడా నోటీసులు జారీ చేయడానికి ఏసీబీ సిద్ధపడుతుందని టీడీపీ శ్రేణులు అంచనా వేస్తున్నారు.

Also Read:  ఏసీబీ రమ్మంటే అనారోగ్యం అంటున్న సండ్ర

సండ్ర అరెస్ట్‌తో తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాలలో ఉన్న టీడీపీ శ్రేణులు కలవరపడుతున్నారు. కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు ఇక పార్టీలో ఉండలేమనే భావనను వ్యక్తం చేస్తున్నారు. టీటీడీపీ నాయకులెవరూ సండ్ర అరెస్టుపై స్పందించకపోవడం వారిలో అభద్రతాభావాన్ని తెలియజేస్తున్నది. అంధ్ర ప్రాంతంలో ఉన్న నాయకులు, మంత్రులు కూడా సండ్ర అరెస్టు విషయమై నోరు విప్పడం లేదు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్, ఏపీ సచివాలయంలో మంత్రులు మీడియాకు అందుబాటులో లేకుండా జాగ్రత్తపడ్డారు. సండ్ర అరెస్టు వార్తను తెలుసుకున్న మంత్రులు ఎవరి కంటపడకుండా ఇళ్లకు వెళ్లిపోయారు.

Also Read:  ఫోన్ ట్యాపింగ్ అంశంలో డీజి అనురాధపై బదిలీ వేటు

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sandra  TDP  Chandrababu Naidu  Ap  Ministers  ACB  Telangana  Cash for Vote case  

Other Articles